తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే ప్రశ్న..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రశ్నించారు. బీచ్ రోడ్డు వెంబడి తీరప్రాంతాల్లో ప్రజా సౌకర్యాలు, పర్యాటక మౌలిక సదుపాయాలు, తీర రక్షణకు సంబంధించి సీఆర్ జెడ్ అనుమతులను త్వరితగతిన పొందేందుకు తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యే ప్రశ్న వేయగా.. మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ ద్వారా సీఆర్ జెడ్ అనుమతులు మంజూరు చేస్తారని మంత్రి తెలిపారు. సీఆర్ జెడ్ అనుమతుల కోసం...