Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించిన ఎన్‌హెచ్‌ఆర్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.డి. గౌస్

    Author VENKATESH | 16 Aug 2026, 09:05 PM | నల్గొండ
    చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించిన ఎన్‌హెచ్‌ఆర్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.డి. గౌస్

    దేవరకొండ 16ఆగస్టు (BVK 3 న్యూస్ ) : దేవరకొండ పట్టణానికి చెందిన పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు, భక్త మార్కండేయ దేవస్థానం కార్యవర్గ సభ్యులు, ఎన్‌హెచ్‌ఆర్సీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాకం చంద్రమౌళి కుటుంబాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.డి. గౌస్ పరామర్శించారు.
    ​ఇటీవల తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుని ఇంటికి వచ్చిన మాకం చంద్రమౌళి కుమార్తెను వారు స్వయంగా ఇంటికి విచ్చేసి ఆప్యాయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.
    ​ఈ కష్ట సమయంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఎన్‌హెచ్‌ఆర్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.డి. గౌస్‌కు మరియు మొత్తం ఎన్‌హెచ్‌ఆర్సీ టీమ్‌ సభ్యులకు మాకం చంద్రమౌళి కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.