చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించిన ఎన్‌హెచ్‌ఆర్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.డి. గౌస్

దేవరకొండ 16ఆగస్టు (BVK 3 న్యూస్ ) : దేవరకొండ పట్టణానికి చెందిన పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు, భక్త మార్కండేయ దేవస్థానం కార్యవర్గ సభ్యులు, ఎన్‌హెచ్‌ఆర్సీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాకం చంద్రమౌళి కుటుంబాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.డి. గౌస్ పరామర్శించారు. ​ఇటీవల తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుని ఇంటికి వచ్చిన మాకం చంద్రమౌళి కుమార్తెను వారు స్వయంగా ఇంటికి విచ్చేసి ఆప్యాయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ​ఈ కష్ట సమయంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఎన్‌హెచ్‌ఆర్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...