Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జెండా ఎగరేయడంలోనూ నిర్లక్ష్యమా? కామేపల్లి సర్పంచ్ తీరుపై ఆగ్రహం!

    Author VENKATESH | 16 Aug 2026, 11:25 AM | నల్గొండ
    జెండా ఎగరేయడంలోనూ నిర్లక్ష్యమా? కామేపల్లి సర్పంచ్ తీరుపై ఆగ్రహం!

    స్వాతంత్ర్య దినోత్సవం రోజే జాతీయ పతాకానికి అవమానం?

    కామేపల్లి గ్రామపంచాయతీ లో తలకిందులుగా జాతీయ పతాకం ఎగురవేత

    గ్రామ సర్పంచ్‌ నకరికంటి రాములు పై స్థానికుల ఆగ్రహం..

    ఇవి కూడా చదవండి

    అధికారుల విచారణకు డిమాండ్


    దేవరకొండ 15ఆగస్టు (BVK 3 న్యూస్ ) : దేవరకొండ నియోజకవర్గం డిండి మండలం కామేపల్లి గ్రామం లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కామేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసిన ఘటన వివాదాస్పదంగా మారింది.
    స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గ్రామ సర్పంచ్ నకరికంటి రాములు ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఉల్టాగా ఎగురవేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ పతాకానికి సంబంధించిన నిబంధనలు పాటించకుండా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    దేశ స్వాతంత్ర్యాన్ని స్మరించుకునే పవిత్రమైన రోజున జాతీయ పతాకం విషయంలో నిర్లక్ష్యం చోటుచేసుకోవడం బాధాకరమని పలువురు పేర్కొన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, వాస్తవాలను పరిశీలించి విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
    జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వడం ప్రతి పౌరుడి బాధ్యత. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనే జాతీయ పతాకానికి అవమానం జరిగిందన్న ఆరోపణలు రావడం పట్ల అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.