జెండా ఎగరేయడంలోనూ నిర్లక్ష్యమా? కామేపల్లి సర్పంచ్ తీరుపై ఆగ్రహం!

స్వాతంత్ర్య దినోత్సవం రోజే జాతీయ పతాకానికి అవమానం? కామేపల్లి గ్రామపంచాయతీ లో తలకిందులుగా జాతీయ పతాకం ఎగురవేత గ్రామ సర్పంచ్‌ నకరికంటి రాములు పై స్థానికుల ఆగ్రహం.. అధికారుల విచారణకు డిమాండ్ దేవరకొండ 15ఆగస్టు (BVK 3 న్యూస్ ) : దేవరకొండ నియోజకవర్గం డిండి మండలం కామేపల్లి గ్రామం లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కామేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గ్రామ సర్పంచ్ నకరికంటి రాములు ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఉల్టాగా ఎగురవేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ పతాకానికి సంబంధించిన నిబంధనలు పాటించకుండా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ...