Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండలో మాకం చంద్రమౌళి కుటుంబాన్ని ఆప్యాయంగా పరామర్శించిన పద్మశాలి సంఘం నాయకులు

    Author VENKATESH | 15 Aug 2026, 03:05 PM | నల్గొండ
    దేవరకొండలో మాకం చంద్రమౌళి కుటుంబాన్ని ఆప్యాయంగా పరామర్శించిన పద్మశాలి సంఘం నాయకులు

    దేవరకొండ 15ఆగస్టు (BVK 3 న్యూస్ ) : బాధలో ఉన్నప్పుడు ఓదార్పు పలకడం, కష్టాల్లో వెంట నిలబడి ధైర్యం చెప్పడమే నిజమైన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని పట్టణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు, భక్త మార్కండేయ దేవస్థానం కార్యవర్గ సభ్యులు మాకం చంద్రమౌళి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
    ​అనారోగ్యంతో అత్యంత క్లిష్ట పరిస్థితిలో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి తిరిగి వచ్చిన తన కూతురిని దేవరకొండ పట్టణ పద్మశాలి సంఘం నాయకులు ఆప్యాయంగా పరామర్శించినట్లు ఆయన తెలిపారు.
    ​దేవరకొండ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు ఉప్పల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి పగిడిమర్రి నాగరాజు, కోశాధికారి గాజుల వినయ్ కుమార్ ఆధ్వర్యంలో... సంఘం మహిళా విభాగం, యూత్ విభాగం మరియు కులబాంధవులు నేరుగా ఇంటికి విచ్చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా యువతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యం కోలుకోవాలని ఆకాంక్షించడంతో పాటు తమ కుటుంబానికి ఎనలేని మనోధైర్యాన్ని, ఆత్మీయ భరోసానిచ్చారని తెలిపారు.
    ​తమ విలువైన సమయాన్ని వెచ్చించి పరామర్శించి, ఈ కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్క పద్మశాలి సంఘం నాయకులకు, మహిళా-యూత్ విభాగాల సభ్యులకు మరియు కులబాంధవులకు మాకం చంద్రమౌళి కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. మీరు అందించిన ఈ ఆత్మీయతను జీవితాంతం మరువలేమని ఆయన పేర్కొన్నారు.