దేవరకొండలో మాకం చంద్రమౌళి కుటుంబాన్ని ఆప్యాయంగా పరామర్శించిన పద్మశాలి సంఘం నాయకులు
దేవరకొండ 15ఆగస్టు (BVK 3 న్యూస్ ) : బాధలో ఉన్నప్పుడు ఓదార్పు పలకడం, కష్టాల్లో వెంట నిలబడి ధైర్యం చెప్పడమే నిజమైన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని పట్టణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు, భక్త మార్కండేయ దేవస్థానం కార్యవర్గ సభ్యులు మాకం చంద్రమౌళి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
అనారోగ్యంతో అత్యంత క్లిష్ట పరిస్థితిలో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి తిరిగి వచ్చిన తన కూతురిని దేవరకొండ పట్టణ పద్మశాలి సంఘం నాయకులు ఆప్యాయంగా పరామర్శించినట్లు ఆయన తెలిపారు.
దేవరకొండ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు ఉప్పల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి పగిడిమర్రి నాగరాజు, కోశాధికారి గాజుల వినయ్ కుమార్ ఆధ్వర్యంలో... సంఘం మహిళా విభాగం, యూత్ విభాగం మరియు కులబాంధవులు నేరుగా ఇంటికి విచ్చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా యువతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యం కోలుకోవాలని ఆకాంక్షించడంతో పాటు తమ కుటుంబానికి ఎనలేని మనోధైర్యాన్ని, ఆత్మీయ భరోసానిచ్చారని తెలిపారు.
తమ విలువైన సమయాన్ని వెచ్చించి పరామర్శించి, ఈ కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్క పద్మశాలి సంఘం నాయకులకు, మహిళా-యూత్ విభాగాల సభ్యులకు మరియు కులబాంధవులకు మాకం చంద్రమౌళి కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. మీరు అందించిన ఈ ఆత్మీయతను జీవితాంతం మరువలేమని ఆయన పేర్కొన్నారు.