Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేశ రక్షణలో సైనికుల త్యాగాలు మరువలేనివి: రాజకీయ స్వార్థం కోసం సైనికులను విమర్శించడం దారుణం

    Author VENKATESH | 13 Aug 2026, 02:30 PM | నల్గొండ
    దేశ రక్షణలో సైనికుల త్యాగాలు మరువలేనివి: రాజకీయ స్వార్థం కోసం సైనికులను విమర్శించడం దారుణం

    కొండా లలిత బాయి బీసీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అండ్ సోషల్ సర్వీస్ , దేవరకొండ (నల్గొండ జిల్లా)
    దేవరకొండ 13ఆగస్టు (BVK 3 న్యూస్ ) : మన దేశ ప్రజలందరికీ నమస్కారం. మన దేశం బాగుండాలంటే, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని తమ ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబాలను త్యాగం చేసి, సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న ఇండియన్ ఆర్మీ జవాన్లకు ప్రతి ఒక్కరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి.
    ​అటువంటి త్యాగమూర్తులను మనలో చాలామంది సరిగా గుర్తించడం లేదు. నేడు మన రాష్ట్రాలలో పరిస్థితి ఎలా తయారైందంటే—కేవలం రాజకీయాల కోసం, సీట్ల కోసం, పదవుల కోసం కొట్లాడుకుంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. చెప్పలేని దుర్మార్గానికి ఒడిగడుతూ, దేశాన్ని కాపాడే సైనికులపైనే విమర్శలు చేస్తూ వారి మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు.
    ​ఇలా ప్రవర్తించే నాయకులు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. "నేను పెద్ద లీడర్ని, పెద్ద నాయకున్ని" అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క సంవత్సరం సరిహద్దుల్లో కాపలాగా ఉండి చూడండి; అప్పుడే ప్రాణం విలువ, మనిషి విలువ ఏమిటో, ఆ కష్టం ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది.
    ​పాపం, ఆర్మీ ఆఫీసర్లు మరియు జవాన్లందరూ కూడా తమ భార్యపిల్లలను వదులుకుని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితుల్లో, ప్రాణాలతో ఇంటికి వస్తామో లేదో అనే అనిశ్చితితో, కంటి మీద కునుకు లేకుండా, సరైన ఆహారం కూడా సరిగ్గా తీసుకోకుండా జీవిస్తున్నారు. అంతటి గొప్ప త్యాగాన్ని కూడా గుర్తించకపోతే మన సమాజంలో మానవత్వం ఎక్కడ ఉన్నట్టు?
    ​సొల్లు మాటలు మాట్లాడే ఈ నాయకులు ఎవరూ తమ భార్యపిల్లలను వదిలి ఉండలేరు. రకరకాల నీచపు అలవాట్లకు పాల్పడుతూ సమాజాన్ని చెడగొడుతున్నారు తప్ప, దేశానికి ఏ ఒక్క మంచి పని చేయడం లేదు. సమాజ శ్రేయస్సు కోసం, దేశం కోసం ఏ ఒక్కరు కూడా నీతి నిజాయితీని నిరూపించుకోలేకపోతున్నారు. ఇదే నేడు మన దేశంలో నెలకొన్న దయనీయమైన పరిస్థితి.