దేశ రక్షణలో సైనికుల త్యాగాలు మరువలేనివి: రాజకీయ స్వార్థం కోసం సైనికులను విమర్శించడం దారుణం

కొండా లలిత బాయి బీసీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అండ్ సోషల్ సర్వీస్ , దేవరకొండ (నల్గొండ జిల్లా) దేవరకొండ 13ఆగస్టు (BVK 3 న్యూస్ ) : మన దేశ ప్రజలందరికీ నమస్కారం. మన దేశం బాగుండాలంటే, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని తమ ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబాలను త్యాగం చేసి, సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న ఇండియన్ ఆర్మీ జవాన్లకు ప్రతి ఒక్కరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి. ​అటువంటి త్యాగమూర్తులను మనలో చాలామంది సరిగా గుర్తించడం లేదు. నేడు మన రాష్ట్రాలలో పరిస్థితి ఎలా తయారైందంటే—కేవలం రాజకీయాల కోసం, సీట్ల కోసం, పదవుల కోసం కొట్లాడుకుంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. చెప్పలేని దుర్మార్గానికి ఒడిగడుతూ, దేశాన్ని కాపాడే...