Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నేదునూరి పిలుపు

    Author VENKATESH | 11 Aug 2026, 10:08 PM | కరీంనగర్
    నేదునూరి పిలుపు

    యువశక్తి మేలుకో
    నీ దేశాన్ని ఏలుకో
    ఆలోచిస్తూ ఆలస్యం
    చేయకు యువతరమా !
    అడుగు ముందుకు వెయ్యి
    చీకట్లను చీల్చుకుంటూ
    ప్రగతి దివ్వెను వెలిగించు.
    నిదుర మత్తు వదిలిపెట్టి
    మేలుకో నీలో దాగున్న
    సింహాన్ని మేలుకొలుపు
    పట్టుదల సంకల్పం ప్రగతి
    సాధనకు మార్గాలుగా
    ఎంచుకో
    నిరాశల నిస్పృహలను తరిమికొట్టి
    ఆకాశమే హద్దుగా దూసుకుపో
    ఆత్మవిశ్వాసమే ఆయుధంగా
    లక్ష్య సాధనలో ముందుకెళ్లు
    జాతిని నడిపించే చైతన్య
    రథానివి నీవు
    దేశ భవిష్యత్తును మార్చే
    అస్త్రానివి నీవు
    కులమతాల గోడలు బద్దలు
    కొట్టి సమ సమాజ
    నిర్మాణానికి నడుం బిగించు
    స్వార్ధపు ఆలోచనలు వీడి
    సమరశంఖం పూరించి
    అవినీతి అంతానికి పంతం పూను
    పాలకుల తప్పిదాలను ప్రశ్నించే
    గొంతుక కావాలి నీవు
    అభివృద్ధి బాటలో అడుగులు
    వేయి నేర రాజకీయాల రొంపిని
    కడిగే గంగవు కావాలి
    కుళ్ళు రాజకీయాలను
    కూకటి వేళ్ళతో పెకిలించాలి
    నేర రాజకీయాలనుఅడ్డుకో
    నేరగాళ్ల గుండెల్లో
    సింహస్వప్నమై నిలిచిపో
    ఓటును నోటుకు అమ్మే
    సంస్కృతిని అంతం చేయి
    నిప్పు లాంటి నాయకత్వాన్ని
    నువ్వే నిర్మించు
    జాతిని నడిపించే చైతన్య
    రథానివి నీవు
    దేశ భవిష్యత్తును మార్చే
    అస్త్రానివి నీవు
    కులమతాల గోడలు బద్దలు
    కొట్టి సమసమాజ నిర్మాణానికి
    నడుం బిగించు స్వార్థపు
    ఆలోచనలు వీడి సమర
    శంఖం పూరించు
    అవినీతి అంతానికి పంతం
    బూనాలి అభివృద్ధి బాటలో
    అడుగులు వేయాలి
    నేర రాజకీయాల రొంపిని
    కడిగేసే గంగవు కావాలి
    కుళ్ళు రాజకీయాలను
    కూకటి వీళ్ళతో పెకిలించాలి
    భయపడక భరతమాత
    సంకెళ్ళను తెంచాలి
    నీ స్వచ్ఛమైన పాలనతో
    దేశాన్ని నడిపించాలి.
    దేశమంటే మట్టి కాదు
    దేశ మంటే మనుషులోయ్
    ఆ మనుషుల గుండెల్లో
    ఆశల దీపానివి కావాలి
    ఓయువశక్తి ఆలస్యం
    చేయక ఇక మేలుకో
    నీజ్ఞానంతో శ్రమతో
    ఈదేశాన్ని ఏలుకో !
    చరిత్రను చదివే
    నిస్సాహాయిడిగా మిగిలిపోకు
    నూతన చరిత్ర లిఖించే
    నాయకుడివి కావాలి
    రేపటి ప్రగతి నీఅడుగులతోనే
    మొదలవ్వాలి నీనవభారత
    స్వప్నం నలుదిక్కుల సాకారం
    కావాలి యువశక్తి మేలుకో
    దేశ భవితను ఏలుకో
    (ఆగస్ట్ 12అంతర్జాతీయ యువజన సంవత్సరం సందర్భంగా
    రాసిన కవిత)
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు తెలంగాణ
    ఎకనామిక్ ఫోరం
    తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
    మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
    రచయిత కాలమిస్ట్
    కరీంనగర్