నేదునూరి పిలుపు

యువశక్తి మేలుకో నీ దేశాన్ని ఏలుకో ఆలోచిస్తూ ఆలస్యం చేయకు యువతరమా ! అడుగు ముందుకు వెయ్యి చీకట్లను చీల్చుకుంటూ ప్రగతి దివ్వెను వెలిగించు. నిదుర మత్తు వదిలిపెట్టి మేలుకో నీలో దాగున్న సింహాన్ని మేలుకొలుపు పట్టుదల సంకల్పం ప్రగతి సాధనకు మార్గాలుగా ఎంచుకో నిరాశల నిస్పృహలను తరిమికొట్టి ఆకాశమే హద్దుగా దూసుకుపో ఆత్మవిశ్వాసమే ఆయుధంగా లక్ష్య సాధనలో ముందుకెళ్లు జాతిని నడిపించే చైతన్య రథానివి నీవు దేశ భవిష్యత్తును మార్చే అస్త్రానివి నీవు కులమతాల గోడలు బద్దలు కొట్టి సమ సమాజ నిర్మాణానికి నడుం బిగించు స్వార్ధపు ఆలోచనలు వీడి సమరశంఖం పూరించి అవినీతి అంతానికి పంతం పూను పాలకుల తప్పిదాలను ప్రశ్నించే గొంతుక...