Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అసలైన బలవంతులు ?

    Author VENKATESH | 09 Aug 2026, 06:07 PM | కరీంనగర్
    అసలైన బలవంతులు ?

    దేహాన్ని దేవాలయంగా
    భావించే వారు
    ఉదయమే మేల్కొనే వారు
    ఆరోగ్యకరమైన పౌష్టికరమైన
    ఆహారాన్ని తీసుకునేవారు
    ఆరోగ్యమే మహాభాగ్యమనే
    జీవనశైలిని కలిగిన వారు
    బ్రహ్మ ముహూర్తాన
    మేల్కొని ధ్యానం యోగ
    చేయడమే ప్రథమ
    కర్తవ్యంగా
    భావించేవారు
    రోజుకు ఎనిమిది గంటలు
    కంటి నిండా నిద్ర పోయేవారు
    నిద్రను పవిత్ర కార్యంగా
    భావించి దానికి తగిన
    సమయం కేటాయించి
    నిద్రా యజ్ఞంలో
    తరించేవారు
    శరీరం సౌష్టవం పెంచుకొని
    తమ ఆరోగ్యాన్ని
    సంరక్షించుకునే వారు
    నిత్య వ్యాయామాలు
    చేసి చురుకైన మానసిక
    శక్తిని కలిగినవారు
    మన ఆరోగ్యం
    మన చేతుల్లో
    ఉంటుందని
    గమనించిన వారు
    మెరుగైన జీవన శైలి
    మీదనే భవిష్యత్
    ఆరోగ్యం ఆధారపడి
    ఉంటుందని తెలుసుకొని
    మసులుకునే వారు
    జీవిత లక్ష్య సాధనలో
    పట్టుదలను పెట్టుబడిగా
    పెట్టిన వార
    తాము చేసే వ్యాయామం
    మీదనే తమ భవిష్యత్తు
    శారీరక మానసిక
    ఆరోగ్యం ఆధారపడి
    ఉంటుందని తెలుసుకొని
    మసులుకునేవారు
    తమ మీద విశ్వాసంతో
    పనిని ప్రేమిస్తూ
    భయపడకుండా
    పనిని వాయిదా
    వేయకుండా పని
    చేసిన వారే అసలైన
    బలవంతులు
    నేర్చుకున్న
    నైపుణ్యాలతో
    సకాలములో
    అభివృద్ధి సాధించి
    ఇతరులకు
    మార్గదర్శిగా నిలిచే
    వారు
    ప్రగతియే ధ్యేయంగా
    మార్పుయే లక్ష్యంగా
    అభివృద్ధి పథంలో
    ముందుకుసాగి
    సమాజ సమగ్రాభివృద్ధి కోసం
    అడుగులు ముందుకు
    వేసే ఛోధక సామర్థ్యాలు
    ఉన్నవారు
    మార్పు ఓర్పు నేర్పు
    సహనం సంఘీభావం
    సౌబ్రాతృత్వ వ్యక్తిత్వాలు
    సామాజిక మార్పును కోరే
    లక్షణాలున్న వారే అసలైన
    బలవంతులు.
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    ఇండిపెండెంట్ జర్నలిస్ట్
    ఫ్రీలాన్స్ రైటర్
    సామాజిక ఆర్థిక విశ్లేషకులు కరీంనగర్
    9440245771