అసలైన బలవంతులు ?
దేహాన్ని దేవాలయంగా భావించే వారు ఉదయమే మేల్కొనే వారు ఆరోగ్యకరమైన పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకునేవారు ఆరోగ్యమే మహాభాగ్యమనే జీవనశైలిని కలిగిన వారు బ్రహ్మ ముహూర్తాన మేల్కొని ధ్యానం యోగ చేయడమే ప్రథమ కర్తవ్యంగా భావించేవారు రోజుకు ఎనిమిది గంటలు కంటి నిండా నిద్ర పోయేవారు నిద్రను పవిత్ర కార్యంగా భావించి దానికి తగిన సమయం కేటాయించి నిద్రా యజ్ఞంలో తరించేవారు శరీరం సౌష్టవం పెంచుకొని తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకునే వారు నిత్య వ్యాయామాలు చేసి చురుకైన మానసిక శక్తిని కలిగినవారు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని గమనించిన వారు మెరుగైన జీవన శైలి మీదనే భవిష్యత్ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తెలుసుకొని మసులుకునే వారు...