Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మంగపేట లో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

    Author VENKATESH | 09 Aug 2026, 04:38 PM | ములుగు
    మంగపేట లో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

    ములుగు జిల్లా ప్రతినిధి,
    ఆగస్టు 09 (బీవీకే న్యూస్):
    ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ఆదివాసి ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం మంగపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురష్కరించుకుని మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీలలో ఆయా గ్రామాలకు చెందిన ఆదివాసి నాయకులు ఆయా గ్రామాలలో జెండా ఎగురవేసి ఆదివాసి దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆదివాసి గ్రామ పెద్దలు, ఆదివాసి సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు , ఉపాద్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలకు చెందిన నాయకులు, ఆదివాసి ప్రజలు మండలంలోని బోరు నర్సాపురంకు చేరుకుని అక్కడ నుండి మండల కేంద్రంలోని కొమరం భీం విగ్రహం వరకు ఆదివాసి సాంప్రదాయ నృత్యాలతో, జై ఆదివాసీ జై జై ఆదివాసీ అంటూ నినాదాలిచ్చుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. మంగపేటలో అంబేద్కర్ విగ్రహానికి, కొమరం భీమ్ విగ్రహానికి ఆదివాసి సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొమరం భీమ్ విగ్రహం వద్ద ఆదివాసి జెండా ఎగురవేశారు. అనంతరం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాలకు చెందిన పలువురు నాయకులు మాట్లాడుతూ ఆదివాసుల హక్కులు, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ఎందరో మహానీయులు త్యాగాలు చేశారన్నారు. ఆదివాసీ వర్గాల సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు గొప్ప వీరయ్య, గొప్ప సమ్మారావు, పొదెం కృష్ణ ప్రసాద్, కొండా చెంచయ్య, కబ్బాక శ్రావణ్, నల్లబోయిన లక్ష్మణ్ దొర, అయ్యోరి యానయ్య, మద్దెల అంజయ్య, తాటి నాగరాజు, , జబ్బ రవి, పొదెం రవీందర్, ఎట్టి సారయ్య, బాడిశ నాగ రమేష్, పొదెం మేనక, డబ్బుల ముత్యాల రావు, రూప భద్రయ్యచాద మల్లయ్య, తల్లడి నాగేశ్వర రావు, సోయం ఈశ్వర్, తోలేం రామకృష్ణ,కొంచెం మొగిలి, తోలెం నరసింహారావు , కోరెం శ్రీను, పూనెం రాములు, కొమరం రవి, పూనెం ప్రశాంత్, కుర్సం రమేష్, పొదెం నాగేష్,ఆక తిరుమలరావు, కొమరం లక్ష్మీపతి, కబ్బాక లక్ష్మణ్, కొమరం సారన్న, కొమరం బాలన్న,ఇరప అరుణ, తోలేం సౌమ్య, వాగబోయిన లావణ్య,పుసాం సావిత్రి, ఇరప రజిని, కొమరం లక్ష్మీపతి, మద్దెల నాగేశ్వరరావు, కొమరం రవి, జోగ నరేందర్, ముక్తి రవి, వివిధ పార్టీలకు చెందిన మైల జయరాం రెడ్డి, చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు, ఎల్పీ.ముత్యాలు, పగిడిపెల్లి వెంకటేశ్వర్లు, గుగ్గిళ్ళ సురేష్ , మురుకుట్ల నరేందర్, ఎంపెళ్లి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.