మంగపేట లో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 09 (బీవీకే న్యూస్): ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను ఆదివాసి ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం మంగపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురష్కరించుకుని మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీలలో ఆయా గ్రామాలకు చెందిన ఆదివాసి నాయకులు ఆయా గ్రామాలలో జెండా ఎగురవేసి ఆదివాసి దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆదివాసి గ్రామ పెద్దలు, ఆదివాసి సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు , ఉపాద్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలకు చెందిన నాయకులు, ఆదివాసి ప్రజలు మండలంలోని బోరు నర్సాపురంకు...