Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హలో కల్లు గీత చలో ములుగు ఆగస్టు16 బస్సు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

    Author VENKATESH | 06 Aug 2026, 08:16 PM | ములుగు
    హలో కల్లు గీత చలో ములుగు ఆగస్టు16 బస్సు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

    ములుగు జిల్లా ప్రతినిధి,
    ఆగస్టు 06(బీవీకే న్యూస్):
    ఎన్నికల ముందు కల్లు గీత కార్మికుల కు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలి బస్సు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేసిన గీత కార్మికులు
    కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గుండెబోయిన రవిగౌడ్ జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్
    వెంకటాపూర్ (రామప్ప )కల్లు గీత కార్మికుల న్యాయమైన సమస్య లు తక్షణమే పరిష్కారం చేయాలనీ డిమాండ్ చేస్తూ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కల్లు గీత చైతన్య రణభేరి పోరు బస్సు యాత్ర పోస్టర్ ను సోసైటీ అధ్యక్షులు గునిగంటి శోభన్ గౌడ్ అధ్యక్ష తన తల్లాపాడు సెంటర్ లోని రేణుక ఎల్లమ్మ గుడి ఆవరణలో గురువారంరోజున ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఈ కార్యక్రమం కు ముఖ్య అతిది గా హాజరైన కల్లు గీతకార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గుండెబోయిన రవిగౌడ్ కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడు తూ ఆగస్టు 2 న ప్రారంభం అయిందని ఆగస్టు 16 న ములుగు వస్తుందని అన్నారు. దీనికి వెంకటాపూర్ మండలం లోని అన్ని గ్రామాల గీత కార్మికులు హాజరై జయప్రదం చేయాలని గీత కార్మికుల కు పిలుపు నిచ్చారు. పెండింగ్ లొ ఉన్నా ఎక్స్ గ్రేషియాలు తక్షణమే విడుదల చేయాలనీ రద్దు చేసిన టాడి కార్పొరేషన్ చెక్కులు పునరుద్దరణ చేయాలనీ 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికునికి ఎటువంటి షరతులు లేకుండా వృత్తి పింఛన్ మంజూరు చేయాలనీ డిమాండ్ చేశారు. ప్రతి సోసైటీ కి 10 ఎకరాలు భూమి చెట్ల పెంపకం కోసం ప్రభుత్వం కొని ఇవ్వాలని అన్నారు.. సమస్య ల పరిష్కారం కొరకు ఆగస్టు 16 న ములుగు వచ్చే బస్సు యాత్ర కార్యక్రమం కు అధిక సంఖ్యలో హాజరు అయి విజయవంతం చేయాలనీ వారు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లొజిల్లా ఉపాధ్యక్షులు పులి రమేష్ గౌడ్ సోసైటీ ఉపాధ్యక్షులు మునిగాల వెంకటేష్ గౌడ్, పోశాల వీరమల్లు గౌడ్ , మండ బిక్షపతి గౌడ్, దొమ్మటి రాజ సమ్మయ్య గౌడ్, మునిగాల రాజు గౌడ్, మునిగాల శ్రీనివాస్ గౌడ్, పోశాల సదయ్య గౌడ్ తో 20 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.