Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓ మనిషి ప్రయత్నం ముద్దు తిరస్కరణ వద్దు

    Author VENKATESH | 05 Aug 2026, 02:21 PM | కరీంనగర్
    ఓ మనిషి ప్రయత్నం ముద్దు తిరస్కరణ వద్దు

    (మన నమ్మకమే మనల్నినడిపించే దీపం అవుతుంది అనే వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాసిన కవిత )
    ఓ మనిషి ప్రయత్నించు
    పరాజయం ఎదురైనా
    పరిగెత్తడం మానకు
    చీకటిని చూసి భయపడకు
    ఉదయించే సూర్యుడిని
    మరువకు!
    కనురెప్పల వెనుక
    దాగిన కలలను
    కన్నీటితో కడిగేయకు
    గాయపడిన గుండెతో
    గమ్యాన్ని వదిలేయకు
    తిరస్కరణ అనేది
    నీఅర్హతకు ముగింపు కాదు
    నీలోదాగిన అగ్నిపర్వతానికి
    ప్రతీక
    నిన్ను వెలివేసిన లోకం
    ముందే తలెత్తి నిలబడు
    నువ్వు ఓడిపోయావన్న
    పెదవులనే నీ విజయంతో
    ముద్దాడించు
    రక్తం చిందించైనా సరే
    నీసామ్రాజ్యాన్ని నిర్మించు
    పడిపోవడం అవమానం కాదు
    పడే ఉన్నామనుకోవడమే
    పరాజయం
    ఓమనిషి ప్రయత్నించు
    శ్వాస ఉన్నంతవరకు పోరాడు
    కాలాన్ని ఎదిరించి నీపేరు చరిత్ర
    పుటల్లో లిఖించు
    నీవెనుక ఉన్న శూన్యాన్ని చూసి
    భయపడకు నీ ముందున్న
    అనంత విశ్వాన్ని గెలిచేందుకు
    అడుగు ముందుకు వేయి
    చివరగా ఒకటే గుర్తుంచుకో
    నిన్ను తిరస్కరించిన వారే
    రేపు నీవిజయానికి సాక్షిగా
    నిలబడతారు.
    ప్రయత్నం నీఆయుధమైతే
    విజయం నీబానిస అవుతుంది
    నిరాశన వీడి ఆత్మవిశ్వాసంతో
    అడుగు ముందుకు వేయడమే
    నీవు సాధించబోయే అద్భుత
    విజయానికి తొలి మెట్టు
    ఓడిపోతాననే భయంతో
    చాలామంది ప్రయత్నించరు
    ప్రయోగాలు చేయరు.
    కొత్త బాధ్యతలు తీసుకోరు
    సురక్షితమైన జీవితం
    గడపడం సులభం
    సార్ధకమైన జీవితం
    గడపడం గొప్ప విషయం
    చదువుల్లో వెనుకబడిన విద్యార్థిని
    తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయుడు
    చేసిన ప్రయత్నం ఆశించినంత
    ఫలితం ఇవ్వకపోవచ్చు.
    ఒక సామాజిక కార్యకర్త చేపట్టిన
    ఉద్యమం తక్షణ విజయం
    సాధించకపోవచ్చు యువ
    పారిశ్రామిక వేత్త ప్రారంభించిన
    సంస్థ మూతబడిపోవచ్చు
    అయినా వారి ప్రయత్నాలు
    వృధాకావు
    వారు వేసిన అడుగుల మీదనే
    మరొకరు నడుస్తారు వారు
    వేసిన దారిలోనే మరొకరు
    గమ్యాన్ని చేరుకుంటారు
    జీవితాన్ని కేవలం విజయాల
    మైళ్ళ రాళ్ళతో కొలువరాదు
    ఉన్నత ఆశయంతో చేసే విలువైన
    ప్రయత్నం దాని వెనుక ఉన్న
    ఉద్దేశం సమాజానికి ఒనగూడే
    ప్రయోజనం పరిగణనలోకి
    తీసుకోవాలి
    ఉదాత్తమైన ఓటములు
    రేపటి విజయాలకు
    వెలుతురు దారులౌతాయి.
    ఉన్నత ఆశయంతో చేసే విలు
    వైన ప్రయత్నం వెనుక ఉన్న
    ఉద్దేశం దాని వల్ల సమాజానికి
    ఒనగూరే ప్రయోజనం
    పరిగణనలోకి తీసుకోవాలి
    ఉదాత్తమైన ఓటములు
    రేపటి విజయాలకు వెలుతురు
    దారులౌతాయన్న సత్యాన్ని
    స్పూర్తిగా తీసుకొని యువత
    ముందడుగు వేయాలి.
    ప్రగతి బాట నడవాలి
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    1)తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    2)మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
    3)అధ్యక్షులుఎడ్యుకేషన్ ఫోరం
    4)రచయిత కాలమిస్ట్
    కరీంనగర్9440245771