ఓ మనిషి ప్రయత్నం ముద్దు తిరస్కరణ వద్దు

(మన నమ్మకమే మనల్నినడిపించే దీపం అవుతుంది అనే వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాసిన కవిత ) ఓ మనిషి ప్రయత్నించు పరాజయం ఎదురైనా పరిగెత్తడం మానకు చీకటిని చూసి భయపడకు ఉదయించే సూర్యుడిని మరువకు! కనురెప్పల వెనుక దాగిన కలలను కన్నీటితో కడిగేయకు గాయపడిన గుండెతో గమ్యాన్ని వదిలేయకు తిరస్కరణ అనేది నీఅర్హతకు ముగింపు కాదు నీలోదాగిన అగ్నిపర్వతానికి ప్రతీక నిన్ను వెలివేసిన లోకం ముందే తలెత్తి నిలబడు నువ్వు ఓడిపోయావన్న పెదవులనే నీ విజయంతో ముద్దాడించు రక్తం చిందించైనా సరే నీసామ్రాజ్యాన్ని నిర్మించు పడిపోవడం అవమానం కాదు పడే ఉన్నామనుకోవడమే పరాజయం ఓమనిషి ప్రయత్నించు శ్వాస ఉన్నంతవరకు పోరాడు కాలాన్ని ఎదిరించి నీపేరు చరిత్ర...