Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆగస్టు 09 న ప్రపంచ ఆదివాసి దినోత్సవం ప్రతి ఆదివాసి గూడెం ప్రతి గ్రామం లో అకుపచ్చ జెండా ఎగిరేయాలని

    Author VENKATESH | 02 Aug 2026, 06:54 PM | ములుగు
    ఆగస్టు 09 న ప్రపంచ ఆదివాసి దినోత్సవం  ప్రతి ఆదివాసి గూడెం ప్రతి గ్రామం లో అకుపచ్చ జెండా ఎగిరేయాలని

    మన్య సీమ పరిరక్షణ సమితి మహిళ జిల్లా అధ్యక్షురాలు ఇరుప అరుణ పిలుపు

    ములుగు జిల్లా ప్రతినిధి,
    ఆగస్టు 02(బీవీకే న్యూస్):

    ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రము లో మన్య సీమ భవనంలో మండల మహిళా ప్రధాన కార్యదర్శి పూసం సావిత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు ఇరుప అరుణ మాట్లాడుతూ ఆగస్టు 09న ప్రపంచ నలమూలలో ఉన్న ఆదివాసులంత ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరుపుకుంటారు ఈ దినోత్సవం ఉద్దేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదివాసి ప్రజల హక్కులను పరిరక్షించడం వారి సంస్కృతి సంప్రదాయాలు భాషలు జీవన విధానాన్ని గౌరవించడం విద్య ఆరోగ్యం భూమి అటవీ వనరులు ఉపాధి రంగాల్లో వారి హక్కులపై అవగాహన పెంచడం ఆదివాసీల అభివృద్ధి సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని ప్రపంచ దేశాలకు గుర్తు చేయడం జరిగింది దీనిని 1994 డిసెంబర్ 23న అసెంబ్లీ లో ఒక తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి ప్రజల అంతర్జాతీయ దినోత్సవం గా ప్రకటించింది దీనిని మొదటిసారిగా 1995 ఆగస్టు 9న ఈ దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించారు ఈ ప్రపంచ ఆదివాసి దినోత్సవానికి మంగపేట మండలంలో ఉన్న ప్రతి ఆదివాసి గూడెం ప్రతి ఆదివాసి గ్రామాన ఆకుపచ్చ జెండా ఎగిరేసి ఆదివాసుల ఆత్మగౌరవని హక్కులకై పోరాడాలని పిలుపునిస్తూ పెద్ద ఎత్తున మండల కేంద్రంనికి తరలివచ్చి ప్రపంచ ఆదివాసి దినోత్సవం విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మన్యసీమ మహిళ జిల్లా ఉపాధ్యక్షురాలు తోలేం సౌమ్య, మండల ప్రధాన కార్యదర్శి పుసం సావిత్రి, వాగబొయిన లావణ్య, కురసం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి