Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్నేహానికన్న మిన్న లోకాన లేదురా

    Author VENKATESH | 02 Aug 2026, 05:23 PM | కరీంనగర్
    స్నేహానికన్న మిన్న లోకాన లేదురా

    "ఒక మంచి పుస్తకం వంద
    మంది స్నేహితులతో సమానం
    కానీ ఒక మంచిస్నేహితుడు
    ఒక గ్రంధాలయంతో సమానం"
    _ఏ 'పీ 'జే అబ్దుల్ కలాం.
    స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
    కలిసి నడిచే అడుగులో కష్టం తెలియదురా కన్నీరు తుడిచే చేతికిస్వార్థం ఉండదురా కల్మషం లేని నవ్వులకు స్నేహమే వేదిక కావాలిరానిజమైన స్నేహం అనేది
    రెండు శరీరాలలోఒకే ఆత్మలాంటిది
    స్నేహినితో పంచుకుంటే బాధలు అన్ని సగంఅవుతాయిరా కలిసి
    పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుందిరా అవగాహనే స్నేహానికి బలమైన శక్తి కాలం మారినా లోకం మారినా స్నేహం
    బంధం మారదు జీవిత ప్రయాణంలో స్నేహమే మనకు
    శ్రీరామరక్షఆశల తీరానికి స్నేహమే
    చుక్కాని నిరాశ చీకటిని
    చీల్చే వెలుగు స్నేహంస్నేహం కలకాలం నడిచే వీడని బంధం కష్టాల చీకటిలో వెలిగే దీపం
    భవిష్యత్తుకు దారి దీపం
    చిరునవ్వుల తోటలో విరబూసినమన స్నేహం మాటలు దాటని మనసుల సాక్షి మౌనం తెలిపే మమతల వంతెన
    అపార్థాల అలలు ఎన్ని వచ్చినా
    ఆత్మీయ తీరం చేర్చే నావ స్నేహం
    లోకమంతా ఎదురు తిరిగి
    నిలిచినా నా వెనుక ఉండేధైర్యం స్నేహంనా తప్పులను సరిదిద్ది సరైన మార్గం చూపించే మార్గదర్శి
    నా గెలుపుకు నీవు పొందే సంతోషం మన స్నేహానికి
    ప్రతి రూపం నావిజయాలనే
    సొంత విజయాలుగా సందడి
    చేసేది స్నేహమేస్నేహం ఈ సృష్టిలో
    ఒక అపురూప కావ్యం
    యుగాలైన చెరిగిపోని
    జ్ఞాపకం మరణమైన విడదీయని
    సత్యం స్నేహంనువ్వు నాపక్కన ఉంటే చాలు నేస్తమా ప్రతిరోజు పండగేయుగాలు మారిన తరాలు
    గతించిన మన స్నేహగీతం
    వినిపిస్తూనే ఉండాలి.స్నేహహస్తం అందిద్దాంసామాజిక ఉద్రిక్తతలను
    అడ్డుకుందాం సామాజిక
    శాంతిని స్థాపిద్దాం
    "స్నేహం లేకపోతే జీవితంలో ఏదీ
    లేదు అన్ని సంపదలు ఉన్నప్పటికీ
    స్నేహితులు లేని జీవితం వ్యర్థం"
    _అరిస్టాటిల్
    స్నేహమే నాజీవితం స్నేహమే నాశాశ్వతంస్నేహమనేది వ్యాపారం
    కాదు ఒక పవిత్రమైన బంధం
    ప్రతిఫలం ఆశించనిదే నిజమైన
    స్నేహం అన్నస్వామి వివేకానంద
    వాక్య యువత జీవన శైలి కావాలి
    స్నేహం ఆందోళనలకు దూరంగా ఆనందానికి దగ్గరగా నూతన జీవితాన్ని ఆవిష్కరించాలి.
    (ఆగస్ట్2 స్నేహితుల దినోత్సవం సందర్భంగా)
    నేదునూరి కనకయ్య అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    కాలమిస్ట్ రచయిత
    కరీంనగర్ 9440245771