స్నేహానికన్న మిన్న లోకాన లేదురా

"ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం కానీ ఒక మంచిస్నేహితుడు ఒక గ్రంధాలయంతో సమానం" _ఏ 'పీ 'జే అబ్దుల్ కలాం. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కలిసి నడిచే అడుగులో కష్టం తెలియదురా కన్నీరు తుడిచే చేతికిస్వార్థం ఉండదురా కల్మషం లేని నవ్వులకు స్నేహమే వేదిక కావాలిరానిజమైన స్నేహం అనేది రెండు శరీరాలలోఒకే ఆత్మలాంటిది స్నేహినితో పంచుకుంటే బాధలు అన్ని సగంఅవుతాయిరా కలిసి పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుందిరా అవగాహనే స్నేహానికి బలమైన శక్తి కాలం మారినా లోకం మారినా స్నేహం బంధం మారదు జీవిత ప్రయాణంలో స్నేహమే మనకు శ్రీరామరక్షఆశల తీరానికి స్నేహమే చుక్కాని నిరాశ చీకటిని చీల్చే వెలుగు...