Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క

    Author VENKATESH | 01 Aug 2026, 09:14 PM | ములుగు
    ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క

    - గోదావరి శాంతించాలని ప్రత్యేక పూజ
    - గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలన
    - చీకుపల్లి బ్రిడ్జి డైవర్షన్ రోడ్డు పరిశీలిన
    - బోగత జలపాతం సందర్శన
    ములుగు జిల్లా ప్రతినిధి,
    ఆగస్టు 01(బీవీకే న్యూస్):
    ములుగు జిల్లా వాజేడు మండలంలోని పూసూరు వంతెన వద్ద పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క,జిల్లా కలెక్టర్ బోర్ఖడె హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటిడిఏ పిఓ లెనిన్ వస్సల్ టోప్సో లతో కలిసి గోదావరి వరద ఉధృతిని శనివారం పరిశీలించి శాంతించాలని ప్రత్యేక పూజ చేశారు. అక్కడి నుండి బయలుదేరి తెలంగాణ నయాగార బొగత జలపాతాన్ని సందర్శించి పరిశీలించి పర్యాటకులు వీక్షించేందుకు శనివారం నుండి అనుమతి ఉందని, కానీ ఈత కొలనులోకి అనుమతి లేదని, అటవీ ప్రాంతంలో ఉన్న అనుమతి లేని జలపాతాలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పర్యాటకులకు సూచించారు. అనంతరం చీకుపల్లి–పెద్దగొల్లగూడెం గ్రామాల మధ్య ఇసుకవాగు వంతెన వద్ద భారీ వర్షాలకు దెబ్బతిన్న డైవర్షన్ రోడ్డును పరిశీలించి గోదావరి బ్యాక్ వాటర్ తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అనంతరం ఇటీవల అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన ఫోటోగ్రాఫర్ చెన్నం రాజు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి తక్షణ సహాయంగా 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని, అదనంగా నిత్యవసర సామగ్రి, కార్పొరేషన్ ద్వారా రుణం(లోన్) మంజూరు అయ్యేలా సంబంధిత అధికారులతో మాట్లాడి సహకారం అందిస్తామని, ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తదుపరి ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దంతులూరి ప్రసాద్ రాజు నివాసానికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి పార్టీని నమ్ముకుని పనిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి గోదావరి వరదల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సివిల్, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పి మనన్ భట్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ కృపాకర్, పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.