Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    Author VENKATESH | 31 Jul 2026, 08:24 PM | ములుగు
    భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరదల పట్ల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    * మెడిగడ్డ, ఇంద్రావతి బ్యారేజ్ ల నుండి నీటిని విడుదల చేయడం తో తగు జాగ్రత్తలు వహించాలి
    * అన్ని శాఖల అధికారులు ప్రజలను సమన్వయంతో అప్రమత్తం చేయాలి
    * రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క .

    ములుగు జిల్లా ప్రతినిధి,
    జూలై 31(బీవీకే న్యూస్):

    భారీ వర్షాల కారణం గా ఎగువ నుండి వరద ఉదృతం గా వస్తుండటం తో గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తుపాకులగూడెం సమ్మక్క–సారక్క బ్యారేజ్ గేట్లు ఎత్తివేయడంతో గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున గోదావరి పరివాహక ప్రాంతాలు కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట వాజేడు, వెంకటాపురం మండలాల లోని ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు, జాలర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలను అప్రమత్తం చేయాలనీ సూచిస్తూ,
    లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల హెచ్చరికలు, సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని, అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు అధికారుల సమన్వయము తోఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తరలించాలని జిల్లా యంత్రాంగం కు ఆదేశాలు జారీ చేస్తూ, ప్రతిక్షణం పోలీస్ శాఖ అప్రమత్తం గా వుంటూ ఎప్పటికప్పుడు పరివాహక ప్రాంత ప్రజలకు తగు సూచనలు చేయాల్సింది గా అదేశిస్తూ, గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఏదైనా క్లిష్ట సమయం ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని మంత్రి
    సీతక్క తెలిపారు.

    ఇవి కూడా చదవండి