భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* మెడిగడ్డ, ఇంద్రావతి బ్యారేజ్ ల నుండి నీటిని విడుదల చేయడం తో తగు జాగ్రత్తలు వహించాలి * అన్ని శాఖల అధికారులు ప్రజలను సమన్వయంతో అప్రమత్తం చేయాలి * రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క . ములుగు జిల్లా ప్రతినిధి, జూలై 31(బీవీకే న్యూస్): భారీ వర్షాల కారణం గా ఎగువ నుండి వరద ఉదృతం గా వస్తుండటం తో గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తుపాకులగూడెం సమ్మక్క–సారక్క బ్యారేజ్ గేట్లు ఎత్తివేయడంతో గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున గోదావరి పరివాహక ప్రాంతాలు కన్నాయిగూడెం,...