Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓ మనిషిఆరోగ్యమే ఆనందంనా చేతిలో జీవితం

    Author VENKATESH | 23 Jul 2026, 05:03 PM | EDITORIAL
    ఓ మనిషిఆరోగ్యమే ఆనందంనా చేతిలో జీవితం

    (జూలై24 అంతర్జాతీయ
    స్వీయ సంరక్షణ దినోత్సవం
    సందర్భంగా రాసిన కవిత)

    ఓ మనిషి ఉరుకుల
    పరుగుల జీవితంలో
    సెలవు లేని పనుల
    లోకంలో ఇతరుల
    కోసం బతికే క్రమంలో
    నిన్ను నీవు
    మరిచిపోతున్నావా?

    జీవిత పోరాటం
    నిత్యం ఆరాటం
    నీ జీవన శైలైంది

    అందరి నవ్వుల్లో
    నీ సంతోషాన్ని
    వెతుక్కుంటూ
    నీ కంటి కన్నీటిని
    ఏకాంతలో దాచేస్తున్నావా?

    పగలనక రేయనక
    కస్టపడి నలిగి పోతున్న
    దేహాంతో అందరి
    బాధ్యతలు మోస్తూ
    ఆరోగ్యాన్ని క్షీణింప
    చేసుకుంటున్నావు

    నువ్వు బాగుంటేనే కదా
    నీ సమాజం బాగుంటుంది
    నువ్వు నవ్వుతేనే కదా
    నీ ఇల్లు నవ్వుతుంది
    ఒక్క క్షణ క్షణం ఆగు

    నీ ఊపిరిని నువ్వు గమనించు
    కరిగిపోతున్న నీఆరోగ్యాన్ని
    కాస్త ప్రేమించు యోగ ధ్యానం
    నడక పరుగునీ జీవనశైలి
    కావాలి

    ఇతరులను ప్రేమించే ముందు
    నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో
    నీ శ్రేయస్సే నీకు శ్రీరామ రక్ష
    స్వీయ సంరక్షణ అంటే స్వార్థం
    కాదు అది నీ జీవితాన్ని నువ్వు
    గౌరవించే ఒక పవిత్రమైన బాధ్యత

    ఇవి కూడా చదవండి

    నువ్వు ఆరోగ్యంగా ఉన్నపుడే
    నీ కలలు సజీవంగా ఉంటాయి
    నీ శరీరాన్ని మనసును
    కాపాడుకోవడం కంటే గొప్ప
    పెట్టుబడి మరొకటి లేదు

    స్వీయ సంరక్షణ అంటే నిన్ను
    నీవు దాచుకోవడం కాదు
    నిన్ను నీవు మళ్ళీ బతికించుకోవడం
    నీకోసం నీవు బ్రతకడం నేర్చుకో

    ప్రపంచాన్ని మార్చే ముందు
    నిన్ను నువ్వు మార్చుకో
    అందరి బాధ్యతలుమోసే
    ముందు నీఆరోగ్యాన్ని
    నువ్వు చూసుకో

    ఓ మనిషి నీజీవిత ప్రయాణంలో
    నీకంటే ముఖ్యమైన ప్రయాణికుడు
    ఎవరు లేరు ఇతరుల కోసం
    బ్రతకడం గొప్పే కానీ అందుకోసం
    నిన్ను నీవు నిర్లక్ష్యం చేసుకోవడం
    తప్పు నీఆరోగ్యమే నీఆస్తి

    ఈరోజే ఈ క్షణమే మీఆరోగ్యానికి
    ప్రాధాన్యత ఇవ్వండి ఆరోగ్యాన్ని
    మార్కెట్లో కొనలేము ఇంకొకరికి
    ట్రాన్స్ఫర్ చేయలేము

    మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి
    ఎందుకంటే ఆరోగ్యమే ఆనందం
    ఆజీవితం నీచేతిలోనే ఉందనే
    సత్యాన్ని మరువకండి

    శరీరం దేవాలయం
    మీమనసు అందులోని
    ప్రశాంతత వాటిని
    కాపాడుకోవాల్సిన
    పూర్తి బాధ్యత మీదే
    మీకోసం మీరుకేటాయించే
    ప్రతిక్షణం మీ రేపటి
    విజయానికి ఇంధనం

    ఆరోగ్యకరమైన మనసుతో
    దృఢమైన సంకల్పంతో సరికొత్త
    రేపటి వైపు అడుగులు వేద్దాం
    అందరికి ఆరోగ్యం అనే
    లక్ష్యసాధనలో క్రియాశీల
    భాగస్వాములమౌదాం
    ఆరోగ్యమే ఆనందం
    ఆనందమే మహాభాగ్యం.

    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎడ్యుకేషన్
    ఫోరం మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి ఫ్రీలాన్స్ రైటర్
    కాలమిస్ట్ కరీంనగర్
    9440245771