ఓ మనిషిఆరోగ్యమే ఆనందంనా చేతిలో జీవితం

(జూలై24 అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం సందర్భంగా రాసిన కవిత) ఓ మనిషి ఉరుకుల పరుగుల జీవితంలో సెలవు లేని పనుల లోకంలో ఇతరుల కోసం బతికే క్రమంలో నిన్ను నీవు మరిచిపోతున్నావా? జీవిత పోరాటం నిత్యం ఆరాటం నీ జీవన శైలైంది అందరి నవ్వుల్లో నీ సంతోషాన్ని వెతుక్కుంటూ నీ కంటి కన్నీటిని ఏకాంతలో దాచేస్తున్నావా? పగలనక రేయనక కస్టపడి నలిగి పోతున్న దేహాంతో అందరి బాధ్యతలు మోస్తూ ఆరోగ్యాన్ని క్షీణింప చేసుకుంటున్నావు నువ్వు బాగుంటేనే కదా నీ సమాజం బాగుంటుంది నువ్వు నవ్వుతేనే కదా నీ ఇల్లు నవ్వుతుంది ఒక్క క్షణ క్షణం ఆగు నీ ఊపిరిని నువ్వు గమనించు కరిగిపోతున్న నీఆరోగ్యాన్ని...