Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మనిషి బతుకు కుదేలు

    Author VENKATESH | 21 Jul 2026, 05:09 PM | EDITORIAL
    మనిషి బతుకు కుదేలు

    ఉరుకుల పరుగుల హైటెక్
    యుగంలో శాస్త్ర సాంకేతికత
    పరుగులు పెడుతున్నప్పటికీ
    నాలుగు గోడల నడుమ
    మనిషి బ్రతుకు కుదేలైంది

    మనుషుల మధ్య మాటలు
    తగ్గిపోయాయి ఈర్ష్య ద్వేషాలు
    చెలరేగుతున్నాయి
    హత్యలు ఆత్మహత్యలు
    సమాజాన్ని శాసిస్తున్నాయి

    ఫోన్ల లోకంలో బంధాలన్నీ మాయమవుతున్నాయి
    ఒంటరితనంతో మనుసులు
    గాయపడుతున్నాయి

    ఫేస్బుక్ లైకుల్లో నిజమైన
    సంతోషం దొరకదు
    నలుగురితో కలిస్తేనే మానసిక
    ప్రశాంతత లభిస్తుంది
    కష్టసుఖాలు పంచుకునే
    వేదికలు మనకు కావాలి
    కలిసినవ్వే రోజులు మళ్లీ
    తిరిగి రావాలి

    చదువుతోనే ‌విద్యా విజ్ఞానం
    వికసించాలి చదువుతోనే అజ్ఞాన
    చీకట్లను తరిమికొడదాం
    విజ్ఞాన వెలుగులతో దేశ
    ప్రగతిని పెంచుదాం

    పిల్లలు పనిలో కాదు బడిలో
    ఉండాలి భావి భారత పౌరులుగా
    ఎదగడం బాలల హక్కు కావాలి
    విద్యాహక్కులతో ఉచిత విద్య
    అందించాలి బాలకార్మిక రహిత
    సమాజాన్ని నిర్మించాలి

    ఇవి కూడా చదవండి

    ప్రతి బిడ్డను బడిబాట పట్టిద్దాం.
    ప్రతి బిడ్డను సంస్కారవంతమైన
    పౌరులను తీర్చిదిద్దుదాం

    పచ్చని ప్రకృతి మనకు
    ప్రాణాధారం పర్యావరణాన్ని
    కాపాడడం మన కర్తవ్యం కావాలి
    మొక్కలు నాటుదాం ప్రతి ఇంట
    కాలుష్య మహమ్మారిని
    అరికడుదాం

    హింస లేని నవ సమాజాన్ని
    నిర్మిద్దాం కల్మషాలు వీడి అందరూ
    ఒకటిగా కలుద్దాం కలహాలు లేని
    మంచి సమాజాన్ని నిర్మిద్దాం.

    ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ
    కాదు ఐక్యతను మించిన బలం
    ఇంకొకటి లేదు కలిసికట్టుగా
    సాగితే విజయం మన
    సొంతమవుతుంది

    ద్వేషాన్ని గెలిచిన చోటే
    మానవత్వం వికసిస్తుంది
    అక్షరాల వెలుగుతో
    అజ్ఞానాన్ని జయించాం
    పచ్చని ప్రకృతితో
    కాలుష్యాన్ని ఓడిద్దాం

    ఒంటరితనాన్ని వీడి
    సమాజంతో కలిసి నడుద్దాం
    కన్నకలలను నవ సమాజ
    నిర్మాణంతో నిజం చేసి
    చూపిద్దాం.

    నలుగురితో కలిసి నడిచే
    అడుగే నవసమాజానికి పునాది
    ఆకలయిక సాధించే విజయమే
    రేపటి ప్రగతికి నాంది కావాలి
    కలిసి నడుద్దాం ప్రగతిని
    పురోగతిని సాధిద్దాం
    వికసిత్ భారత్ లక్ష్య
    సాధనకు ఉద్యమిద్దాం

    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఫోరం
    మాజీ ఎన్ ఎస్ ఎస్
    ప్రోగ్రాం అధికారి
    కరీంనగర్
    9440245771