Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అండ‌ర్‌-15 పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా బ్యాన్‌.. ఫ్రాన్స్ పార్ల‌మెంట్‌లో బిల్లు

    Author VENKATESH | 21 Jul 2026, 04:44 PM | Technology
     అండ‌ర్‌-15 పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా బ్యాన్‌.. ఫ్రాన్స్ పార్ల‌మెంట్‌లో బిల్లు

    15 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా బ్యాన్ చేయాల‌ని ఫ్రాన్స్(France) భావిస్తున్న‌ది. దీని కోసం బిల్లును రూపొందించారు. ఆ బిల్లును ఇవాళ పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. మంగ‌ళ‌వారం ఆ బిల్లుపై చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ది. సోష‌ల్ మీడియా వినియోగంపై పిల్ల‌ల కోసం ప్ర‌త్యేక ఆంక్ష‌లు కూడా విధించే రీతిలో కొత్త బిల్లును రూపొందించారు. అయితే యురోపియ‌న్ యూనియ‌న్ చ‌ట్టాల ప్ర‌కారం ఆ బిల్లును త‌యారీ చేసిన‌ట్లు ఫ్రాన్స్ చెబుతోంది. సెప్టెంబ‌ర్‌లో కొత్త వార్షిక సంవ‌త్స‌రం ప్రారంభంకానున్న నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా బ్యాన్ అంశంలో ఫ్రాన్స్ పార్ల‌మెంట్ ఆగ‌మేఘాల మీద చ‌ట్టాన్ని రూపొందించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. నేష‌న‌ల్ అసెంబ్లీతో పాటు సేనేట్ స‌భ్యులు ఆ బిల్లుపై ఇప్ప‌టికే ముచ్చ‌టించారు. పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా బ్యాన్ అంశంపై అధ్య‌క్షుడు ఎమ్మాన్యువ‌ల్ మాక్ర‌న్ చాలా క్లారిటీతో ఉన్నారు. ఆ బిల్లును ఆయ‌న స‌మ‌ర్ధిస్తున్నారు. ఇక హై స్కూళ్ల‌లో మొబైల్ ఫోన్ల‌ను బ్యాన్ చేయాల‌ని కూడా మాక్ర‌న్ భావిస్తున్నారు.