అండ‌ర్‌-15 పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా బ్యాన్‌.. ఫ్రాన్స్ పార్ల‌మెంట్‌లో బిల్లు

15 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా బ్యాన్ చేయాల‌ని ఫ్రాన్స్(France) భావిస్తున్న‌ది. దీని కోసం బిల్లును రూపొందించారు. ఆ బిల్లును ఇవాళ పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. మంగ‌ళ‌వారం ఆ బిల్లుపై చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ది. సోష‌ల్ మీడియా వినియోగంపై పిల్ల‌ల కోసం ప్ర‌త్యేక ఆంక్ష‌లు కూడా విధించే రీతిలో కొత్త బిల్లును రూపొందించారు. అయితే యురోపియ‌న్ యూనియ‌న్ చ‌ట్టాల ప్ర‌కారం ఆ బిల్లును త‌యారీ చేసిన‌ట్లు ఫ్రాన్స్ చెబుతోంది. సెప్టెంబ‌ర్‌లో కొత్త వార్షిక సంవ‌త్స‌రం ప్రారంభంకానున్న నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా బ్యాన్ అంశంలో ఫ్రాన్స్ పార్ల‌మెంట్ ఆగ‌మేఘాల మీద చ‌ట్టాన్ని రూపొందించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. నేష‌న‌ల్ అసెంబ్లీతో పాటు సేనేట్ స‌భ్యులు ఆ బిల్లుపై ఇప్ప‌టికే ముచ్చ‌టించారు....