Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణకు వర్ష కబురు - నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు

    Author VENKATESH | 21 Jul 2026, 12:55 PM | TELANGANA
    తెలంగాణకు వర్ష కబురు - నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు

    రాష్ట్రంలో నేడు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది.

    ఈ జిల్లాల్లో వర్షసూచన : ఉపరితల ఆవర్తనంతో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.

    పలు జిల్లాల్లో వర్షాలు : మరోవైపు రాష్ట్రంలో గడిచిన రెండు రోజుల్లో అంటే ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలుచోట్ల భారీగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యు)లో 10.1 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూరు 8.2, నిజామాబాద్‌ గ్రామీణ మండలం మల్కాపూర్‌ 8.1 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి మెదక్​ జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మెదక్​లో 4.8, సిద్దిపేటలోని కుకునూర్​పల్లిలో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 4.3 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.

    ఇవి కూడా చదవండి

    వర్షాల కోసం పలు ప్రాంతాల్లో పూజలు : తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉస్మాన్‌సాగర్ గండిపేట జలాశయంలో చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో వరుణ జపం చేశారు. చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు సి.ఎస్. లక్ష్మీనరసింహన్ నేతృత్వంలో ఆలయ అర్చకులు, వేదపండితులు నడుములోతు నీటిలో నిలబడి వైదిక అనుష్ఠానాన్ని నిర్వహించారు. ఆలయ వేదభవనానికి చెందిన డావి శ్రీరామ ఘనపాటి నాయకత్వంలో ఋత్వికులు తైత్తిరీయ సంహితలోని వరుణ జప మంత్రాలను 108 సార్లు పారాయణం చేశారు. రాష్ట్రంలోని చెరువులు, నదులు, జలాశయాలు నిండిపోవాలని, పంటలు పునరుజ్జీవం పొందాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. యావత్తు లోకక్షేమం చేకూరాలని ఈ మహా ప్రార్థన నిర్వహించినట్లు పూజారులు వెల్లడించారు. గతంలో వర్షాలు పడకపోతే 2019లో వరుణ జపం చేసామని సమృద్ధిగా వానలు కురుసాయని తెలిపారు. ఇవాళ ఎంతో నియమ నిష్టలతో చేసిన వరుణ జపంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పండితులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

    వర్ష పాశుపత వరుణ యాగం : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కొండపైన ఉన్న అనుబంధ ఆలయమైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో 'వర్ష పాశుపత వరుణ యాగం' ఆలయ అర్చకులు ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీ వరకు ఈ యాగం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలమైన పాడి పంటలతో విలసిల్లాలని వరుణ యాగం చేపట్టారు. మొదటి రోజు వరుణ యాగంలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, పంచగవ్య ప్రాసనము నిర్వహించి యాగాన్ని ప్రారంభించారు. వరుణయాగంలో ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.