తెలంగాణకు వర్ష కబురు - నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు

రాష్ట్రంలో నేడు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ఈ జిల్లాల్లో వర్షసూచన : ఉపరితల ఆవర్తనంతో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. పలు జిల్లాల్లో వర్షాలు...