Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏజెన్సీలో ఆదివాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై

    Author VENKATESH | 21 Jul 2026, 11:11 AM | ములుగు
    ఏజెన్సీలో ఆదివాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై

    * జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న
    * మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ మంగపేట మండల అధ్యక్షుడు తాటి నాగరాజు.
    ములుగు జిల్లా ప్రతినిధి
    జూలై 20 (బీవీకే న్యూస్):
    ములుగు జిల్లా షెడ్యూల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతం మంగపేట మండలంలోని ఆదివాసి గిరిజన గూడెలలో, గ్రామాలలో స్కూల్ బిల్డింగ్ లు లేక ఇబ్బందులు పడుతున్న పలు గ్రామాలలో స్కూలు బిల్డింగ్ లు నిర్మించాలని కోరుతూ సిసిరోడ్లు డ్రైనేజీలు గ్రామాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ మండల కేంద్రంలో సర్వే నంబర్ 20 ఈధులకుంట చెరువు శిఖము ప్రభుత్వం భూములను ఆక్రమించుకొని బహుళ అంతస్తులు కట్టుతున్న ప్రభుత్వ ఉద్యోగి ఎండి మున్వర్ గిరిజనేతరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 125/1లో రెవెన్యూ శాఖ పెట్టిన బోర్డును తొలగించి అక్రమంగా జామాయిల్ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గిరిజన ప్రాంతంలో గిరిజన చట్టాల ప్రకారం ప్రభుత్వ భూమైన ఫారెస్ట్ భూమైన ఆదివాసులకే చెందుతాయి కానీ ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వలన ఏజెన్సీ ప్రాంత భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. షెడ్యూల్ ప్రాంతంలో గిరిజన చట్టాలు ప్రతిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరిన మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ మంగపేట మండలం అధ్యక్షుడు తాటి నాగరాజు, ఆదివాసి సేన మంగపేట మండలం అధ్యక్షుడు పొలేబోయిన ఆదినారాయణ,అనేబోయిన సమ్మయ్య, తుడుం దెబ్బ నాయకులు పొడెం శోభన్ తదితరులు పాల్గొన్నారు.