Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఒక్క ఓటు కూడా వృధా కావద్దు

    Author VENKATESH | 21 Jul 2026, 10:58 AM | మహబూబ్ నగర్
    ఒక్క ఓటు కూడా వృధా కావద్దు

    - మహబూబ్ నగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ రేవతి, మక్తల్ అసెంబ్లీ కోఆర్డినేటర్ గుత్త అమిత్ రెడ్డి
    - సర్ పై మక్తల్ ల్లో సమీక్ష సమావేశం
    నారాయణపేట, జూలై 20 (బి వి కె న్యూస్)
    ఒక్క ఓటు కూడా వృధా కావద్దనీ, మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఇంచార్జ్ రేవతి మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు
    ఎన్నికల సంఘం సర్ - స్పెషల్ ఇంటెన్షవ్ రెవిజన్ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు సోమవారం పట్టణ అధ్యక్షులు ఎ. రవికుమార్ అధ్యక్షతన
    మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. .
    ఇట్టి సమావేశానికి మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఇంచార్జ్ రేవతి, మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
    ఎన్నికల సంఘం సూచనల మేరకు అన్ని ఏనుమేరేషన్ ఫార్మ్స్ లను సకాలంలో నింపి బిఎల్ఓ లకు అందజేయాలని కోరారు. మక్తల్, అమరచింత, ఆత్మకూరు, కృష్ణ, ఉట్కూర్, మాగనూర్ &నర్వ మండలాల అధ్యక్షులు, BLA లు, సూపర్వైజర్లకు దిశా నిర్దేశం చేశారు.
    "ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదు. BLA లు ప్రతి ఇంటికి వెళ్లి బాధ్యతగా పని చేయాలి. పార్టీ ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో పూర్తి చేస్తే రాబోయే రోజుల్లో పార్టీలో మంచి అవకాశాలు లభిస్తాయి" అని తెలిపారు.
    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు.
    ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి, మక్తల్ మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్ ,మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు, అమరచింత, ఉట్కూర్, కృష్ణ, మాగనూర్, నర్వ,మక్తల్ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు పాల్గొన్నారు.