Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఈనెల 19న బాలుర సైక్లింగ్ పోటీల ఎంపిక

    Author VENKATESH | 17 Jul 2026, 09:40 PM | నారాయణపేట
    ఈనెల 19న బాలుర సైక్లింగ్ పోటీల ఎంపిక

    జిల్లా సైకిలింగ్ అధ్యక్షడు తాన్ సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపాలం

    నారాయణపేట, జిల్లా 17 (బి వి కే న్యూస్)
    తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వారి ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా సైకిలింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం ఆధ్వర్యంలో ఈ నెల 19న ఆదివారం ఉదయం 9 గంటలకు మక్తల్ ఎల్లమ్మ కుంట కొత్త గార్లపల్లి రోడ్డులో14 ,15 ,16 సంవత్సరాల బాలురకు మాత్రమే, పోటీలు నిర్వహిస్తున్నామని,వీరు 2010 జూలై నుండి 2012 జూన్ మధ్యన జన్మించిన అర్హులు అయిన వారు మాత్రమే హైద్రాబాద్ లో గల వేలోడ్రమ్ ( VELODROME) సైకిలింగ్ అకాడమీ లో ప్రవేశం కొరకు, నిర్వహించె సైకిలింగ్ పోటీల లో పాల్గొనలని జిల్లా సైకిలింగ్ అధ్యక్షడు తాన్ సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపాలం తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఆసక్తిగల బాలురు బోనోఫైడ్, సొంత సైకిల్ తో, క్రీడా దుస్తులు ధరించి పాల్గొనాలని వారు తెలిపారు. సైకిలింగ్ పోటీలలో క్రీడా ప్రతిభను చాటిన బాలురను ( సైకిలింగ్ రైడర్స్ ) ను ఎంపిక చేసి, ఈనెల 20 న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో గల వేలోడ్రమ్ ( VELODROME) సైకిలింగ్ అకాడమీలో, తెలంగాణ సైకిలింగ్ కోచ్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగు రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపుతామని బి.గోపాలం తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో చైర్మన్ డాక్టర్ మణికంఠ గౌడ్, ఉపాధ్యక్షుడు జి .శివకుమార్, నిర్వాహణ కార్యదర్శి లు అమ్రేష్ ,దామోదర్ పాల్గొన్నారు. మిగతా వివరాలకు సెల్ నంబర్ 77 02 71 31 39 ను సంప్రదించగలరు.