Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పేదల సొంతింటి కల సాకారం: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవం - దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

    Author VENKATESH | 17 Jul 2026, 08:37 PM | Array
    పేదల సొంతింటి కల సాకారం: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవం - దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

    దేవరకొండ 17జూలై (BVK 3 న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని, ప్రతి అర్హ కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.
    చింతపల్లి మండల కేంద్రానికి చెందిన ఉపసర్పంచ్ శ్రీమతి రహేనా బేగం – సిద్ధిక్ బాబా దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు.
    ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఒక ఆత్మగౌరవ చిహ్నమని, ఆ గౌరవాన్ని పేదలకు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గతంలో ఎన్నో కుటుంబాలు సొంతింటి కోసం ఎదురు చూసినా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వారి కలలు నిజమవుతున్నాయని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహకారంతో నాణ్యమైన ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
    ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.