పేదల సొంతింటి కల సాకారం: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవం - దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ 17జూలై (BVK 3 న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని, ప్రతి అర్హ కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. చింతపల్లి మండల కేంద్రానికి చెందిన ఉపసర్పంచ్ శ్రీమతి రహేనా బేగం – సిద్ధిక్ బాబా దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని...