Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫిఫా ఫైనల్స్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు దూరం..

    Author VENKATESH | 17 Jul 2026, 01:01 PM | Sports
    ఫిఫా ఫైనల్స్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు దూరం..

    ఫిఫా వరల్డ్‌ కప్ 2026 ఫైనల్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ హాజరుకావడం లేదని ప్రకటించారు. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించకుండా.. తన అధికారిక నివాసంలోనే టీవీలో చూస్తానని వెల్లడించారు. దీనికి కారణం తాను నమ్మే ఓ సెంటిమెంట్ అని స్పష్టం చేశారు.
    టోర్నీలో ఇప్పటివరకు అర్జెంటీనా ఆడిన ఏడు మ్యాచ్‌లను కూడా అధ్యక్ష భవనం ‘ఒలివోస్’లోనే వీక్షించానని, ఆ ఏడు మ్యాచ్‌ల్లోనూ జట్టు విజయం సాధించిందని మిలీ తెలిపారు. అదే సెంటిమెంట్‌ను ఫైనల్‌లోనూ కొనసాగిస్తానని చెప్పారు. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే.. ప్రతి మ్యాచ్ సమయంలో తాను ధరించే ప్రత్యేక జాకెట్‌ను కూడా మార్చబోనని మిలీ వెల్లడించారు. ‘స్విట్జర్లాండ్‌తో మ్యాచ్ రోజున చలి కారణంగా ఓ బరువైన జాకెట్ వేసుకున్నాను. వేడిగా అనిపించి మధ్యలో దాన్ని తీసేశాను. వెంటనే ప్రత్యర్థి గోల్ చేసింది. మళ్లీ జాకెట్ వేసుకున్నాక దాన్ని తీయలేదు. అప్పటి నుంచి అదే జాకెట్‌తోనే మ్యాచ్‌లు చూస్తున్నాను’ అని ఆయన చెప్పారు.