ఫిఫా ఫైనల్స్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు దూరం..

ఫిఫా వరల్డ్‌ కప్ 2026 ఫైనల్‌కు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ హాజరుకావడం లేదని ప్రకటించారు. ఆదివారం అర్జెంటీనా-స్పెయిన్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించకుండా.. తన అధికారిక నివాసంలోనే టీవీలో చూస్తానని వెల్లడించారు. దీనికి కారణం తాను నమ్మే ఓ సెంటిమెంట్ అని స్పష్టం చేశారు. టోర్నీలో ఇప్పటివరకు అర్జెంటీనా ఆడిన ఏడు మ్యాచ్‌లను కూడా అధ్యక్ష భవనం ‘ఒలివోస్’లోనే వీక్షించానని, ఆ ఏడు మ్యాచ్‌ల్లోనూ జట్టు విజయం సాధించిందని మిలీ తెలిపారు. అదే సెంటిమెంట్‌ను ఫైనల్‌లోనూ కొనసాగిస్తానని చెప్పారు. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే.. ప్రతి మ్యాచ్ సమయంలో తాను ధరించే ప్రత్యేక జాకెట్‌ను కూడా మార్చబోనని మిలీ...