Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యంగా ఆలయ అభివృద్ధి

    Author VENKATESH | 16 Jul 2026, 09:34 PM | ములుగు
    భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యంగా ఆలయ అభివృద్ధి

    * మల్లూరు హేమాచల క్షేత్రమును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేలా 3 కోట్ల రూపాయల తో మాస్టర్ ప్లాన్
    * రానున్న స్వామి వారి కళ్యాణ మహోత్సవం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం - మంత్రి సీతక్క.
    ములుగు జిల్లా ప్రతినిధి,
    జూలై 16(బి వి కె న్యూస్):
    రెండో యాదాద్రిగా ప్రసిద్ధి చెందిన
    మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రమును దర్శించే భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యంగా మూడు కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి కి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర
    పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు.
    గురువారం ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలోని స్వయంభుగా వెలసిన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ల తో కలిసి మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు సాంప్రదాయ బద్ధంగా, ఆలయ అర్చకులు, కార్య నిర్వహణ అధికారి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోనీ కళ్యాణ మండపంలో
    ఆలయ అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
    ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రానున్న స్వామి వారి
    కళ్యాణం దృష్టిలో పెట్టుకొని మల్లూరు హేమచల క్షేత్రం ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేలా సమగ్ర మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని, ఆలయం కు వచ్చే భక్తుల సౌకర్యార్థం వారికి అవసరం అయ్యే అన్ని వసతులు కల్పించే విధంగా 3 కోట్ల రూపాయలతో దేవస్థాన అభివృద్ధి కోసం కళ్యాణ మండపం, అన్నదాన సత్రం, కళ్యాణకట్ట, మరుగుదొడ్లు, పార్కింగ్, రహదారి విస్తరణ, ఉప ఆలయాల అభివృద్ధి తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి ఎస్టిమేషన్ నివేదిక రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో
    ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ , జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు , జిల్లా ఎస్పి సుదీర్ రామ్నాధ్ కేకన్, ఐపీఎస్, అదనపు కలెక్టర్ మహేందర్ జి,ములుగు డీఎఫ్ఓ వికాస్ మినా, ఐఎఫ్ఎస్, ఐటీడీఏ
    పి ఓ ఏటూరునాగారం లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి, ములుగు ఆర్డిఓ కృష్ణవేణి , ఏఎస్పి ఏటూరునాగారం మనన్ బట్ ,రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య ,జిల్లా ఆత్మ చైర్మన్ చిటమట రఘు, ఎమ్మార్వో తోట రవీందర్, ఎంపిడిఓ భద్రు, మల్లూరు దేవస్థానం ఈవో విరస్వామి, ఆత్మ జిల్లా డైరెక్టర్ లు గాదె శ్రవణ్ కుమార్, రేవంత్ యాదవ్, జిల్లా, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా,
    నియోజకవర్గం, బ్లాక్ కాంగ్రెస్
    మండల, గ్రామ నాయకులు ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.