Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జల్ శక్తి అభియాన్ – "జల్ సంవిధాన్" అవగాహన కార్యక్రమం.

    Author VENKATESH | 16 Jul 2026, 04:33 PM | నల్గొండ
    జల్ శక్తి అభియాన్ – "జల్ సంవిధాన్" అవగాహన కార్యక్రమం.

    దేవరకొండ మున్సిపాలిటీలో నిర్వహణ
    దేవరకొండ 16జూలై (BVK 3 న్యూస్ ) :
    దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో జల్ శక్తి అభియాన్ –జల్ సంవిదాన్ కార్యక్రమంలో భాగంగా, "జల్ సంవిధాన్" అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రజలకు జల సంరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
    ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ, "జల్ సంవిధాన్" స్ఫూర్తితో ప్రతి పౌరుడు నీటిని సంరక్షించడాన్ని తన సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల కోసం భూగర్భ జలాలను కాపాడుకోవడం, వర్షపు నీటిని ఒడిసి పట్టడం నీటి వృథాను అరికట్టడం మరియు ప్రతి ఇంటిలోనూ వర్షపు నీటి నిల్వ వ్యవస్థలను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సుస్థిర భవిష్యత్తుకు ప్రజల భాగస్వామ్యమే పునాది అని వారు స్పష్టం చేశారు.
    "జల్ సంవిధాన్ – ప్రతి ఇంటి బాధ్యత, ప్రతి పౌరుడి కర్తవ్యం" అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ, నీటి పొదుపు అలవాటును ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.
    ఈ కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ సాయి చంద్ర , టిపిబిఓ వర్షిత , ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రమావత్ సకృ నాయక్ , మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.