జల్ శక్తి అభియాన్ – "జల్ సంవిధాన్" అవగాహన కార్యక్రమం.
దేవరకొండ మున్సిపాలిటీలో నిర్వహణ దేవరకొండ 16జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో జల్ శక్తి అభియాన్ –జల్ సంవిదాన్ కార్యక్రమంలో భాగంగా, "జల్ సంవిధాన్" అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రజలకు జల సంరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ, "జల్ సంవిధాన్" స్ఫూర్తితో ప్రతి పౌరుడు నీటిని సంరక్షించడాన్ని తన సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల కోసం భూగర్భ జలాలను కాపాడుకోవడం, వర్షపు నీటిని ఒడిసి పట్టడం నీటి వృథాను అరికట్టడం మరియు ప్రతి ఇంటిలోనూ వర్షపు నీటి నిల్వ వ్యవస్థలను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ప్రజలకు...