Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రోడ్లపై అక్రమ పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు

    Author VENKATESH | 16 Jul 2026, 04:31 PM | నారాయణపేట
    రోడ్లపై అక్రమ పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు

    అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ హుల్ హక్
    నారాయణపేట, జూలై 16 (బి వి కే న్యూస్)
    డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు, అక్రమ పార్కింగ్ లపై పలు విన్నతులు వచ్చినందున జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, IPS ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించడం లక్ష్యంగా అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ హుల్ హక్ పట్టణంలోని ప్రధాన రహదారులను పరిశీలించారు.
    ఈ సందర్భంగా టౌన్ సీఐ శివశంకర్, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్యతో కలిసి సరబ్ బజార్, మెయిన్ చౌక్ నుంచి ఓల్డ్ బస్టాండ్, సత్యనారాయణ చౌరస్తా, యాద్గిరి ప్రధాన రహదారి తదితర రద్దీ ప్రాంతాలను సందర్శించి ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షించారు. రహదారులపై అక్రమంగా పార్కింగ్ చేసిన వాహనాలు, షాపుల ముందు ఆక్రమణలు, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే పరిస్థితులను పరిశీలించి సంబంధిత షాపు యజమానులు, వాహనదారులకు సూచనలు చేశారు.
    ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ... ప్రజల సౌకర్యమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, రహదారులపై ఇష్టానుసారంగా వాహనాలను నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందని అన్నారు. షాపులకు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రోడ్లపై కాకుండా అందుబాటులో ఉన్న పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపివేయాలని సూచించారు.
    రోడ్లపై అక్రమ పార్కింగ్, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నిలిపివేయడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే వాహనాలను టోయింగ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. వ్యాపారులు కూడా తమ దుకాణాల ముందు రహదారిపై వస్తువులను ఉంచకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సహకరించాలని కోరారు.
    నారాయణపేట పట్టణంలో ట్రాఫిక్‌ను మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించి సురక్షితమైన, ట్రాఫిక్ అంతరాయం లేని పట్టణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అదనపు ఎస్పీ పిలుపునిచ్చారు.
    ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ శివశంకర్, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.