రోడ్లపై అక్రమ పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు

అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ హుల్ హక్ నారాయణపేట, జూలై 16 (బి వి కే న్యూస్) డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు, అక్రమ పార్కింగ్ లపై పలు విన్నతులు వచ్చినందున జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, IPS ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించడం లక్ష్యంగా అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ హుల్ హక్ పట్టణంలోని ప్రధాన రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ శివశంకర్, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్యతో కలిసి సరబ్ బజార్, మెయిన్ చౌక్ నుంచి ఓల్డ్ బస్టాండ్, సత్యనారాయణ చౌరస్తా, యాద్గిరి...