Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • RRB సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్

    Author VENKATESH | 16 Jul 2026, 04:28 PM | ఎడ్యుకేషన్
    RRB సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్

    రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గుడ్ న్యూస్ చెప్పింది. సెక్షన్ కంట్రోలర్ (CEN No. 03/2026) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 14, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
    పోస్టుల వివరాలు
    మొత్తం ఖాళీలు: 119
    జోన్ల వారీగా ఖాళీలు:
    రాంచీ – 14, అహ్మదాబాద్ – 11, జమ్మూ & శ్రీనగర్ – 10, చెన్నై – 9, కోల్‌కతా – 8, బెంగళూరు – 8, మాల్దా – 7, భోపాల్ – 6, భువనేశ్వర్ – 6, చండీగఢ్ – 6, ముంబయి – 6, పట్నా – 6, సికింద్రాబాద్ – 5, సిలిగురి – 5, గోరఖ్‌పూర్ – 5, తిరువనంతపురం – 4, ప్రయాగ్‌రాజ్ – 4, బిలాస్‌పూర్ – 4, ముజఫర్‌పూర్ – 3, గువాహటి – 1, అజ్మేర్ – 1
    విద్యార్హత
    గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
    వయోపరిమితి
    226 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
    ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు
    ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
    దివ్యాంగులకు నిబంధనల ప్రకారం 10 నుంచి 15 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.
    జీతం
    ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.
    దరఖాస్తు ఫీజు
    జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు – రూ.500 (CBTకు హాజరైతే రూ.400 రీఫండ్)
    ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మాజీ సైనికులు, ఈబీసీ, దివ్యాంగులు – రూ.250 (పరీక్షకు హాజరైతే పూర్తి ఫీజు రీఫండ్)