Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ‘లెనిన్’ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం..

    Author VENKATESH | 16 Jul 2026, 01:41 PM | Cinema
    ‘లెనిన్’ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం..

    అక్కినేని అఖిల్ కెరీర్‌లో అతిపెద్ద విజయంగా నిలిచిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో గుంటూరులో చిత్రబృందం ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా వసూళ్లు, ప్రేక్షకుల ఆదరణ, రూ.100 కోట్ల క్లబ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సక్సెస్ మీట్‌లో మాట్లాడిన నాగవంశీ.. ‘లెనిన్’ విడుదలకు ముందే ఇది అఖిల్ కెరీర్‌లో తొలి రూ.100 కోట్ల గ్రాస్ సాధించే చిత్రంగా నిలుస్తుందని తాను బలంగా నమ్మానని తెలిపారు. అదే నమ్మకంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని, ఇప్పుడు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ ఆ విశ్వాసాన్ని నిజం చేస్తోందని చెప్పారు.Calculators & Reference Tools
    మొదటి వారం సినిమా అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన వసూళ్లు సాధించిందని, ముఖ్యంగా మాస్ సెంటర్లతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వారాంతంలో పెద్ద తెలుగు సినిమాలు విడుదల కావడం లేదని గుర్తుచేసిన నాగవంశీ.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రేక్షకులు కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లకు వచ్చి ‘లెనిన్’ సినిమాను చూడాలని కోరారు.ఇప్పటికే సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇంకా చూడని వారు ఈ వీకెండ్‌లో తప్పకుండా థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి. మీ అందరి ప్రేమ, ఆదరణతో ‘లెనిన్’ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందనే పూర్తి నమ్మకం ఉంది” అని ఆయన అన్నారు.