‘లెనిన్’ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం..

అక్కినేని అఖిల్ కెరీర్‌లో అతిపెద్ద విజయంగా నిలిచిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో గుంటూరులో చిత్రబృందం ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా వసూళ్లు, ప్రేక్షకుల ఆదరణ, రూ.100 కోట్ల క్లబ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సక్సెస్ మీట్‌లో మాట్లాడిన నాగవంశీ.. ‘లెనిన్’ విడుదలకు ముందే ఇది అఖిల్ కెరీర్‌లో తొలి రూ.100 కోట్ల గ్రాస్ సాధించే చిత్రంగా నిలుస్తుందని తాను బలంగా నమ్మానని తెలిపారు. అదే నమ్మకంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని, ఇప్పుడు ప్రేక్షకులు చూపిస్తున్న...