Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ లీడింగ్‌

    Author VENKATESH | 16 Jul 2026, 01:33 PM | Sports
    గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ లీడింగ్‌

    అర్జెంటీనా స్టార్ ప్లేయ‌ర్ ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో త‌న ఆట‌తీరుతో ఆక‌ట్టుకుంటున్నాడు. దిగ్గ‌జ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా పేరుగాంచిన మెస్సీ త‌న మ్యాజిక్ గేమ్‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్‌లోనూ మెస్సీ త‌న ట్యాలెంట్ ప్ర‌ద‌ర్శించారు. రెండు అసిస్ట్‌లు ఇచ్చి.. జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. అయితే వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీలో ఇచ్చే గోల్డెన్ బూట్(Golden Boot) అవార్డు రేసులో ప్ర‌స్తుతం అర్జెంటీనా ప్లేయ‌ర్ లియోన‌ల్ మెస్సీ ముందున్నారు. మెస్సీ ఖాతాలో 8 గోల్స్‌, 4 అసిస్ట్‌లు ఉన్నాయి. దీంతో అత‌ను అడిడాస్ గోల్డెన్ బూట్ అవార్డు రేసులో దూసుకెళ్లుతున్నాడు.
    అయితే ఫ్రాన్స్‌ను సెమీస్ వ‌ర‌కు తీసుకెళ్లిన ఆ జ‌ట్టు కెప్టెన్ కైలియ‌న్ ఎంబాపే కూడా మెస్సీ వెనుకే దూసుకొస్తున్నాడు. ఎంబాపే ఖాతాలో 8 గోల్స్ , మూడు అసిస్ట్‌లు ఉన్నాయి. గోల్డెన్ బూట్ కోసం రెండో స్థానంలో ఎంబాపే ఉన్నాడు. నార్వేకు చెందిన ఎర్లింగ్ హాలాండ్‌, ఇంగ్లండ్ ప్లేయ‌ర్ జూడ్ బెల్లింగ్‌హామ్‌.. కేన్, ఫ్రాన్స్ ప్లేయ‌ర్ డెంబ్లే, స్పెయిన్ ప్లేయ‌ర్ ఒయ‌ర్‌జెబ‌ల్ త‌ర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్‌పై ఊహించ‌ని రీతిలో కోలుకుని అర్జెంటీనా విక్ట‌రీ న‌మోదు చేయ‌డంతో గోల్డెన్ బూట్ రేసులో ముందు వ‌ర‌స‌లోకి వ‌చ్చేశాడు. వాస్త‌వానికి ఎంబాపే, మెస్సీ మ‌ధ్య గోల్స్ సంఖ్య స‌మంగా ఉన్నా.. అసిస్ట్‌ల సంఖ్య‌లో మెస్సీ ఆధిక్యంలో ఉన్నాడు. దీంతో గోల్డెన్ బూట్ రేసు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక మూడో స్థానం కోసం ఇంగ్లండ్‌తో జ‌రిగే మ్యాచ్‌లో ఫ్రాన్స్ త‌ల‌ప‌డ‌నున్న‌ది. ఒక‌వేళ ఆ మ్యాచ్‌లో ఎంబాపే గోల్స్ చేస్తే, అప్పుడు ప‌రిస్థితి మారే అవ‌కాశం ఉంటుంది.