Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్‌పై ప‌శ్చిమాసియా దెబ్బ‌..

    Author VENKATESH | 14 Jul 2026, 07:55 PM | BUSINESS
    ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్‌పై ప‌శ్చిమాసియా దెబ్బ‌..

    దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఇవాళ‌ భారీ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియా (West Asia) లో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. దాంతో అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు (Banking), రియల్టీ (Realty), ఆటో స్టాక్స్‌ (Auto stocks) లో భారీగా నష్టాలు నమోదయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 561.46 పాయింట్లు నష్టపోయి 77,054.94 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 159 పాయింట్లు క్షీణించి 24,052.05 వద్ద ముగిసింది.
    అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. కొన్ని రక్షణాత్మక రంగాల షేర్లు నిలదొక్కుకున్నప్పటికీ కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి సూచీల పతనానికి దారితీసింది. నిఫ్టీలో హెచ్‌సీఎల్ టెక్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లు ఎక్కువగా నష్టపోయి సూచీపై భారం మోపాయి. ఈ బలహీనత బ్రాడర్ మార్కెట్లకు కూడా విస్తరించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.44 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.01 శాతం మేర నష్టపోయాయి.