Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభమైన రోడ్ల నిర్మాణ శంకుస్థాపన చారిత్రాత్మకమైనది

    Author VENKATESH | 13 Jul 2026, 10:15 PM | నారాయణపేట
    మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభమైన రోడ్ల నిర్మాణ శంకుస్థాపన చారిత్రాత్మకమైనది

    - ప్రజా ప్రభుత్వము కాబట్టే ప్రజా అవసరాలకు ప్రాధాన్యతనిస్తుంది
    - మక్తల్ నుంచి నారాయణపేట వరకు రహదారి ఎన్నో ఏళ్లుగా అగ్నిపరీక్షగా మారింది
    - పది మంది జిల్లా పాలన అధికారులు, పలువురు ఎమ్మెల్యేలు మారినా ఈ రోడ్డు మంజూరు కాలేని దుస్థితి
    - గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పింది తప్ప నాణ్యమైన రహదారుల నిర్మాణంలో పూర్తిగా విఫలమైంది
    - సభాధ్యక్షులు రాష్ట్ర మత్స్యశాఖ , క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
    నారాయణపేట, జూలై 13 (బి వి కే న్యూస్)
    మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభమైన రోడ్ల నిర్మాణ పనులు చారిత్రాత్మకమైనవని, ప్రజాప్రభుత్వం ప్రజల అవసరాలనే ప్రాధాన్యంగా తీసుకొని ఈ భారీ రహదారి ప్రాజెక్టులను మంజూరు చేసిందని,
    మక్తల్ నుంచి నారాయణపేట వరకు రహదారి నిర్మాణం ఎన్నో ఏళ్లుగా అగ్నిపరీక్షగా మారిందని, దాదాపు పది మంది జిల్లా పాలన అధికారులు, పలువురు ఎమ్మెల్యేలు మారినా ఈ రోడ్డు మంజూరు కాలేదని,
    గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పిందని, కానీ నాణ్యమైన రహదారుల నిర్మాణంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు రాష్ట్ర మస్యశాఖ, క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి.
    సోమవారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని నారాయణపేట క్రాస్ రోడ్ లో ఏర్పాటుచేసిన హ్యామ్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం కోసం విచ్చేసిన రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గార్లకు రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఘన స్వాగతం పలికారు.
    అనంతరం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్ తో పాటు ప్రజాప్రతినిధులు కలిసి రూ.237 కోట్లతో నిర్మించనున్న మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు శంకుస్థాపన చేసి, హ్యామ్ రోడ్ల పైలాన్‌ను మంత్రి కోమటి రెడ్డి. వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ...
    గత ప్రభుత్వం పదేళ్ల పాటు మాటలు, ప్రచార ఆర్భాటాలు, రంగురంగుల హామీలతో ప్రజలను మోసం చేశాయి తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని మంత్రి మండిపడ్డారు. నియోజకవర్గంలో నిర్మించిన రహదారులు కూడా నాసిరకంగా ఉండటంతో వందలాది గుంతలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.
    ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల రవాణా కష్టాలు తొలగించాలనే సంకల్పంతో రూ.237 కోట్లతో మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారిని ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.
    మక్తల్ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి పని కోరినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులు వెంటనే సానుకూలంగా స్పందిస్తూ నిధులు మంజూరు చేస్తున్నారని, ఇందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
    ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన మక్తల్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధి బాటలో దూసుకుపోతోందని, ప్రజలు స్వేచ్ఛగా, గౌరవంగా జీవించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
    మక్తల్ అభివృద్ధి ప్రయాణానికి ప్రజల ఆశీర్వాదం, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.
    నేడు మీరిచ్చిన ఈ పదవికి వన్నె తెచ్చేందుకు ఎంత కష్టమైనా ఇష్టంతో పని చేయుటకు నేను నిరంతరము శ్రమిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి. పనులు చేయడం తప్ప హంగులు ఆర్భాటాలు తనకు రావని గత 15 ఏళ్లలో మక్తల్ నియోజకవర్గం నిధులు నియామకాలు సాగునీరు తాగునీరు ఎన్నో కష్టాలకు గురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డించే వాడు మనవాడైతే ఈ మూలకు కూర్చున్న తినడానికి తినే అన్నం వస్తుందని ఈ సామెత తోటే నేడు తాను స్థానికుడని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ ప్రాంత ప్రజల సమస్యలను అవసరాలను పూర్తిగా తెలిసిన వాడిగా కావడంతోటే ఇంతగా రాత్రి పగలు ఆరాటపడుతూ తన నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎనలేని కృషి చేస్తున్నానని అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. రాబోయే రోజుల్లో భక్త నియోజకవర్గ ప్రాంతం యొక్క అభివృద్ధి చూసి విమర్శించిన వారంతా విస్తు పోవాల్సిందేనని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఎవరు ఎన్ని ఏమనుకున్నా ఎంత విమర్శించినా అభివృద్ధి చేయడానికి ముందడుగు వేయడం తప్ప వెనుదిరిగి చూడనని అది నా ప్రజల యొక్క ఆశీర్వాదమే నన్ను ముందుకు తీసుకు వెళుతుందని మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు.
    ఈ కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస, మార్కెట్ చైర్మన్ లు రాధా లక్మారెడ్డి, సదా శివా రెడ్డి, వైస్ చైర్మన్ గణేష్ కుమార్ రేమత్ పాషా మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాగనూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివరామిరెడ్డి ఉట్కూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్య ప్రకాష్ రెడ్డి మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏ రవికుమార్ సీనియర్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు రాజేంద్ర గౌడ్, శ్యామ్ కుమార్ కోళ్ల వెంకటేష్ వర్కు ఆంజనేయులు మేదరి శ్రీనివాసులు, విష్ణువర్ధన్ రెడ్డి పసుల రంజిత్ కుమార్ రెడ్డి ఫయాజ్, సాలంబింగ్ ఉమర్ లక్ష్మణ్ సింగ్ శంషుద్దీన్, శంకర్, కావలి శ్రీహరి
    జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, ఆర్ అండ్ బీ సీ . ఈ .వెంకటేశ్వర్ రావు, ఎస్.ఈ రాజేందర్, వివిధ గ్రామాల సర్పంచులు ఉపసర్పంచులు పార్టీ అధ్యక్షులుప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.