Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓ మనిషి నమ్మకంతో

    Author VENKATESH | 13 Jul 2026, 10:12 PM | కరీంనగర్
    ఓ మనిషి నమ్మకంతో

    అడుగు వెయ్యి గెలిచి చూడు
    ఓ మనిషి పని మొదలు
    పెట్టడానికి కావలసిన
    నమ్మకం కోసం ఎదురు
    చూస్తూ ఉండిపోకు
    నమ్మకం అనేది కూర్చుంటే
    రాదు పని మొదలుపెట్టిన
    తర్వాతే వస్తుంది
    వంద సార్లు ఆలోచించేకంటే
    ఒక్కసారి ప్రయత్నించి చూస్తే
    ఎక్కువ నేర్పుకుంటావు
    నేను ఇప్పుడు పని చేయడానికి
    పూర్తిగా సిద్ధంగా లేను అనే
    సాకులు వెతకద్దు
    సంకోచంద్దు సంకల్పమే ముద్దు
    చిన్న చిన్న సందేహాలతో
    ఆగిపోకు లక్ష్య సాధనలో
    దారిపొడువున చీకటిని
    తిడుతూ భయపడకు
    ఆకాశంలో నక్షత్రాలు
    రాత్రి వేళే మెరుస్తాయి
    నీవు వేసే ముందడుగే
    నీకు వెలుగునిస్తుంది
    నదీ ప్రవాహం ఆగిపోవడం
    చూశామా?
    కొండలు ఎదురొచ్చిన ఆది
    పక్కకు తప్పుకుంటుంది
    కానీ తన ప్రయాణాన్ని
    మాత్రం ఆపదు
    నువ్వు కూడా అంతే
    అడ్డంకులకు అస్సలు లొంగకు
    అవరోధాలను అవకాశాలుగా
    మార్చుకో సుసాధ్యాన్ని
    సాధ్యమని నిరూపించు
    మొదటి అడుగు వేయడానికి
    మనసు ఎంతో వెనుకాడుతుంది
    వేయగలనా లేనా అనే
    సందేహాలను రేపుతుంది
    ఒక్కసారి ధైర్యంగా అడుగు
    ముందుకేస్తే నీ భయాలన్నీ
    ఒక్కసారి మాయమైతాయి
    పసిపాప నడక నేర్చేటవుడు
    ఎన్ని సార్లు పడిపోతుంది?
    పడిపోయిన ప్రతి సారి ఏడుస్తూ
    అక్కడే ఉండిపోతుందా?
    మళ్ళీ లేచి నిలబడుతుంది
    మళ్ళీ అడుగులు వేస్తుంది
    చివరకు పరుగులెడుతూ
    అందరిని ఆశ్చర్య పరుస్తుంది
    నీలో ఉన్న శక్తి ఏంటో
    నీకు తెలియాలంటే
    నీవు గమ్యం వైపు
    పయనం మొదలు పెట్టాలి
    కూర్చొని ఆలోచిస్తే
    కాలం కరిగి పోతుంది
    అతిగా ఆలోచిస్తే
    ఆందోళన
    కుంగుబాటుతో కుదేలై
    పని నుండి నిష్క్రమిస్తావు
    నిష్క్రమణవద్దు
    నిలవడమే ముద్దు
    అప్పుడు కలలు నిజం
    కావడానికి ఏ మార్గం
    దొరకదు
    నీవు వేసే ఒక్క అడుగు
    చిన్నదే కావచ్చు
    ఆది గొప్ప విజయానికి
    నాంది కావచ్చు
    దారి తెలియకపోయిన
    ధైర్యంగా ముందుకుసాగు
    ఆత్మవిశ్వాసమనే నమ్మకం
    నీతోడు నీడైనిన్ను నడిపిస్తుంది
    ఓటమి ఎదురైతే ఓంగిపోకు
    ఆది నీకు గెలుపు గుర్రాన్ని
    ఎక్కే విద్యను నేర్పుతుంది
    అనుభవం నీకుగుణపాఠమై
    గెలుపుకు దిక్సూచి అవుతుంది
    ముందడుగు వేసి చూడు
    లోకం నీవెంట వస్తుంది
    నీపై నీకు నమ్మకం అప్పుడే
    రెట్టింపు అవుతుంది
    ఆలోచనల తీరం దాటి
    ఆచరణలో అడుగుపెట్టు
    నీప్రతి ముందడుగూ
    నీనమ్మకానికి కిరీటమై
    విజయానికి తొలి సంతకం
    మవుతుంది
    నమ్మకంతో వేసే ముందడుగు
    నిన్ను విజయతీరాలకు
    చేర్చుతుంది
    నమ్మకంఆత్మవిశ్వాసమే
    అభివృద్ధికి చోదక శక్తిగా
    నిలిచిమానవాళి వికాసానికి
    మార్గదర్శి అవుతుంది
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
    రచయిత కాలమిస్ట్
    కరీంనగర్9440245771